Lucky Baskhar OTT : ఓటీటీలోకి వచ్చేసిన లక్కీ భాస్కర్.. ఎక్కడ చూడొచ్చంటే

లక్కీ భాస్కర్ మలయాళం సహా ఐదు భాషల్లో విడుదల చేశారు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ 28న విడుదల అయ్యింది.

Lucky Baskhar OTT : ఓటీటీలోకి వచ్చేసిన లక్కీ భాస్కర్.. ఎక్కడ చూడొచ్చంటే
Lucky Bhaskar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2024 | 1:51 PM

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ ప్రేక్షాదరణ పొందింది. నవంబర్ 28న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ సినిమాతో దుల్కర్ సల్మాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లక్కీ భాస్కర్ ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

లక్కీ భాస్కర్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించింది. లక్కీ భాస్కర్ మలయాళం సహా ఐదు భాషల్లో విడుదల చేశారు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ 28న విడుదల అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొంది.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

లక్కీ భాస్కర్‌, ఎస్‌ నాగవంశీ, సాయి గెయ్య నిర్మించిన చిత్రం ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దుల్కర్‌ కు జోడీగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. లక్కీ భాస్కర్ దుల్కర్ 32వ సినిమా. ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరిగింది. నిమిష్ రవి కెమెరా హ్యాండిల్ చేయగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలి ఎడిట్ చేశారు. లక్కీ భాస్కర్ కథ 1990 లలో జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగి భాస్కర్ నల్లధనం గురించి తెలుసుకునే కథాంశంతో సాగుతుంది. తర్వాత సినిమాలో భాస్కర్ బ్యాంకింగ్ రంగంలోని కొన్ని లొసుగులను, స్టాక్ మార్కెట్‌లోని కొన్ని ట్రిక్కులను ఉపయోగించి డబ్బు సంపాదించడం చూపిస్తారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్ల రూపాయలు. ఈ చిత్రం విడుదలైన 26 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 111.76 కోట్లు వసూలు చేసింది.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..