- Telugu News Photo Gallery Cinema photos Do you remember who this heroine is buying vegetables on the roadside? She is Adah Sharma
అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది. పై ఫొటోలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న నటి ఎవరో గుర్తుపట్టారా.?
Updated on: Nov 25, 2024 | 1:35 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు.

మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది. పై ఫొటోలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న నటి ఎవరో గుర్తుపట్టారా.?

ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఆతర్వాత బాలీవుడ్ చెక్కేసి బిజీ హీరోయిన్ అయ్యింది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? సినిమా కోసం ఎలాంటి సాహసాలు అయినా చేస్తుంది ఆ చిన్నది.

ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదా శర్మ. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది. అలాగే అక్కడ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది.




