AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush – Aishwarya: ధనుష్-ఐశ్వర్యలకు విడాకులు మంజూరు.. ఇక ఎవరి దారి వారిదే

తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్-ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయింది. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. 

Dhanush – Aishwarya: ధనుష్-ఐశ్వర్యలకు విడాకులు మంజూరు.. ఇక ఎవరి దారి వారిదే
Danush
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2024 | 7:18 AM

Share

నటుడు ధనుష్, రజినీకాంత్ ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం మేరకే ఈ కేసులో తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది. దీంతో తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్-ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయింది. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. ధనుష్ కంటే ఐశ్వర్య వయసులో పెద్దది అయినప్పటికీ ఇరు కుటుంబాలు పూర్తి అంగీకారంతో వివాహాన్ని నిర్వహించాయి.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

ధనుష్, ఐశ్వర్య దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ జంట తమిళ చిత్రలో లవ్లీ కపుల్ గా పేరుతెచ్చుకున్నారు. ఇక ఐశ్వర్య ధనుష్‌తో “3” చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారారు ఐశ్వర్య. వాయ్ రాజా వాయ్, లాల్ సలామ్ చిత్రాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. జనవరి 2022లో, ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరూ X (ట్విట్టర్) ద్వారా అనౌన్స్ చేశారు.. దాదాపు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ ఇప్పటికీ కోలీవుడ్‌లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు, రెండు కుటుంబాలు మరియు చాలా మంది స్నేహితులు ధనుష్, ఐశ్వర్యలతో చర్చలు జరిపారు. అయితే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిలో 2004లో జరిగిన వివాహాన్ని రద్దు చేయాలంటూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో కేసు వేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించిన కేసు నడుస్తుండగా.. ఇద్దరు కొడుకులకు సంబంధించిన విషయాల్లో మాత్రమే ధనుష్, ఐశ్వర్య కలిసి పాల్గొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా విడాకులు తీసుకోవాలని ఆదేశించారు. విడాకుల ప్రకటన తర్వాత డిప్రెషన్‌లో ఉన్న ఐశ్వర్య రజనీకాంత్.. దాన్నుంచి బయటపడేందుకు మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి సారించింది. అలా ఈ ఏడాది లాల్ సలామ్ సినిమా విడుదలైంది. ఇందులో రజనీ అతిథి పాత్రలో కనిపించారు. అలాగే తన కూతురి విడాకుల విషయంలో రజనీకాంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదట అశ్విన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, అతనికి విడాకులు ఇచ్చింది. రెండవది విశాగన్‌ని వివాహం చేసుకుంది. వీరి వివాహం 2019లో జరిగింది. ఐశ్వర్య సోదరి పద్ధతిలో రెండో పెళ్లి చేసుకుంటుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us