AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

ఈమె పేరు చెప్తే పెద్దగా ఆడియన్స్ గుర్తుపట్టకపోవొచ్చు కానీ ఆమెను చూస్తే .. ఓహో ఈమేనా అనుకుంటారు. పేరుతో కంటే తన నటనతోనే ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయ్యారు

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
Arundhati
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2024 | 11:33 AM

Share

చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటారు. సినిమాలో కనిపించేది కొంతసేపు అయినా ఉన్నంతలో తమ పాత్రకు న్యాయం చేస్తూ ఉంటారు. పెద్దగా గుర్తింపు దక్కకపోయినా.. తమ పాత్రతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన వారిలో సుభాషిణి ఒకరు. ఈమె పేరు చెప్తే పెద్దగా ఆడియన్స్ గుర్తుపట్టకపోవొచ్చు కానీ ఆమెను చూస్తే .. ఓహో ఈమేనా అనుకుంటారు. పేరుతో కంటే తన నటనతోనే ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయ్యారు సుభాషిణి, ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుభాషిణి.

పెళ్లైన హీరోతో ఆ యవ్వారం .. దెబ్బకు కెరీర్ క్లోజ్, ఇప్పుడేమో ఇలా

హీరో, హీరోయిన్స్ కు అక్కగా, వదినగా నటించి మెప్పించారు. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాలు చేశారు సుభాషిణి జయసుధ సిస్టర్ అవుతారు. ఇక అరుంధతి సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమాలో సుభాషిణి నటించారు. ఈ మూవీలో విలన్ గా నటించిన సోనూ సూద్ తల్లిగా ఆమె ప్రేక్షకులను భయపెట్టారు.

Ram Charan: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్..

ముఖ్యంగా సోనూ సూద్ ను సమాధి నుంచి బయటకు రప్పించాలని ఆమె చేసే ప్రయత్నాలు.. ఆమె బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు వణుకు పుట్టించాయి. ఇక ఆమె కూతురు గురించి చాలా మందికి తెలిసి ఉండదు. సుభాషిణి కూతురు పేరు పూజా ఆమె పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ నటించిన 143 సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ అవ్వలేకపోవడంతో పూజకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత ఆమె సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోయింది.

పంజరంలో చిలక.. నేను మీకు అస్సలు దొరక.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టండి చూద్దాం.!

Pooja

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..