AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్..

శంకర్ సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్ .ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దారు శంకర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Ram Charan: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్..
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2024 | 11:58 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం ప్రేక్షకులు ముఖ్యంగా మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ ఆచార్య సినిమాలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు శంకర్ సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్ .ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దారు శంకర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నాడు.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో రంగస్థలం సినిమా చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రంగస్థలం సినిమా తర్వాత మరోసారి సుకుమార్, చరణ్ కలిసి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపికైందని అంటున్నారు. సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని సుకుమార్ ఓ సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో చెప్పాడు. నిజానికి సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును ఇచ్చింది సుకుమారే. ఇక ఇప్పుడు సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం ఇటీవల మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ కూడా మైసూర్‌లో జరగనుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు.

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి