AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KA OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. ఎక్కడ చూడొచ్చంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా క. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది.

KA OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ 'క'.. ఎక్కడ చూడొచ్చంటే?
Ka Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2024 | 10:17 AM

Share

గతేడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది క అంటూ డిఫరెంట్ మూవీతో మన ముందుకొచ్చాడు. పైగా అతని కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. సుజీత్, సందీప్ దర్శక ద్వయం తెరెక్కించిన ఈ విలేజ్ అండ్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన క సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లక్కీ భాస్కర్, అమరన్, బఘీరా వంటి స్టార్ హీరోల సినిమాలను తట్టుకుని మరీ భారీ కలెక్షన్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన క సినిమా రూ. 50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇక కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా క నిలిచింది. అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు కిరణ్ అబ్బవరం సినిమాను చూశారు. టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇలా థియేటర్లలో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించిన క మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. క సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. నవంబర్ 28 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే కిరణ్ అబ్బవరం సినిమా స్ట్రీమింగ్ కు రానుందన్న మాట. థియేటర్ ఎక్సీపీరియెన్స్ మిస్ అవ్వకుండా డాల్బీ విజన్ అట్మాస్ సౌండ్ తో క సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో నటించాడు. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి క సినిమాను థియేటర్లలో లో మిస్ అయ్యారా? లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

క సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌..
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
స్కార్పియోలో వచ్చిన దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ !
వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ !