AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apudo Ipudo Epudo OTT: ఇదేం ట్విస్ట్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. స‌ప్త సాగ‌రాలు దాటి సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది.

Apudo Ipudo Epudo OTT: ఇదేం ట్విస్ట్.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే?
Appudo Ippudo Eppudo Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2024 | 7:43 AM

Share

‘స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిఖిల్- సుధీర్ వర్మ. ఇప్పుడు ఇదే కలయికలో వచ్చిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ద‌క్కించుకున్న రుక్మిణి వ‌సంత్ ఈ సినిమాలో క‌థానాయిక‌గా నటించింది. కరోనా కాలంలో పట్టాలెక్కిన ఈ మూవీ ఎన్నో అవాంతరాలు దాటి నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించలేదు.  నిఖిల్-రుక్మిణీల జోడీకి మంచి పేరొచ్చినప్పటికీ ఆకట్టుకునే కథ, కథనాలు సినిమాలో లేకపోవడంతో ఆడియెన్స్ పెదవి విరిచారు. ఫలితంగా స్పై సినిమా  తర్వాత నిఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశ పర్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ముందస్తుగా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే.  ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 27) అర్ధరాత్రి నుంచే నిఖిల్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది అమెజాన్ ప్రైమ్.

గతంలో ఛ‌త్ర‌ప‌తి, డార్లింగ్, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లాంటి సినిమాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడ‌క్ష‌న్స్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిర్మించాడు. నిఖిల్, రుక్మిణీలతో పాటు మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించడం విశేషం. అలాగే వైవా హర్ష, అజయ్, సత్య, జాన్ విజయ్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సంగీతం అందించగా, సన్నీ.ఎం.ఆర్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ అందించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో ఒక్కసారి చూసేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

దీపావళి వేడుకల్లో నిఖిల్ ఫ్యామిలీ..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్