AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: శ్రీకాంత్ కొడుకు పక్కనున్న ఈ స్టార్ కిడ్స్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోలు

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు మందు నిర్మలా కాన్వెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

Tollywood: శ్రీకాంత్ కొడుకు పక్కనున్న ఈ స్టార్ కిడ్స్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోలు
Tollywood Actors
Basha Shek
|

Updated on: Nov 29, 2024 | 6:20 PM

Share

శ్రీకాంత్ కుమారుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రోషన్. 2015లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమ దేవి సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రోషన్. ఆ మరుసటి ఏడాది అంటే 2016లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ కోటేశ్వర రావు తెరకెక్కించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటించింది. అక్కనేని నాగార్జున మరో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇదే సినిమాలో రోషన్ స్నేహితులుగా ఇద్దరు స్టార్ కిడ్స్ కూడా నటించారు. పై ఫొటో ఆ సినిమాకు సంబంధించినదే. మరి రోషన్ పక్కనున్న ఆ ఇద్దరెవరో గుర్తు పట్టారా? నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోకు స్నేహితులుగా కనిపించిన ఆ స్టార్ కిడ్స్ ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. ఇటీవలే హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో ఒకరు స్టార్ యాకంర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కాగా, మరొకరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.

స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా గతేడాది విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా, చక్కటి నటనతో యాక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రోషన్. ఆ తర్వాత ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు రోషన్. ప్రస్తుతం మోగ్లీ అనే మరో డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడీ క్రేజీ హీరో.

ఇవి కూడా చదవండి

మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల..

ఇక బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆటిట్యూడ్ స్టార్ గా నెట్టింట మస్త్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రహాస్. అక్టోబర్ 04న విడుదలైన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఇందులో తనదైన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడీ యాటిట్యూడ్ స్టార్.

రామ్ నగర్ బన్నీ సినిమాలో చంద్రహాస్..

View this post on Instagram

A post shared by Chandra Hass (@chandrahass8)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..