Tollywood: 15 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్.. 1300 కోట్ల ఆస్తులు.. ఈ బ్యూటీ ఎవరంటే..

నటనపై ఆసక్తితో చిన్న వయసులోనే కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన మెరిసింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆస్తిని సంపాదించుకుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది.

Tollywood: 15 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్.. 1300 కోట్ల ఆస్తులు.. ఈ బ్యూటీ ఎవరంటే..
Asin
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 6:44 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే గట్టిగానే సంపాదించుకుంది. 16 ఏళ్లకే అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఆసిన్. కేరళలోని కొచ్చికి చెందిన కుటుంబంలో జన్మించిన ఆసిన్… మోహిన్ అథం, భారత నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలను నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2001లో 15 ఏళ్ల వయసులోనే నరేంద్రన్ మగన్ జయకాంతన్ వగా మకన్ సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్న ఆసిన్.. ఆ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2003లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. రవితేజ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆసిన్ క్రేజ్ మారిపోయింది.

దీంతో ఈ బ్యూటీకి తెలుగు, తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేసింది. రవితేజ, వెంకటేశ్, నాగార్జున, అజిత్, సూర్య, విజయ్, విక్రమ్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుళ్ శర్మతో ప్రేమలో పడింది. 2016లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఓ పాప జన్మించింది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది ఆసిన్. ప్రస్తుతం ఆసిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆసిన్ ఆస్తి రూ.1300 కోట్లకు పైగా ఉంటుందట.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?