AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడెంటిలా మారిపోయింది!

గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఎంతో మంది తారలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొందరు తమ పిల్లలతో సమయాన్ని గడుపుతుంటే మరికొందరు తమ అభిరుచులు, కలలు నెరవేర్చుకునే పనిలో బిజి బిజీగా ఉంటున్నారు.

Tollywood: ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడెంటిలా మారిపోయింది!
Tollywood Actors
Basha Shek
|

Updated on: Nov 29, 2024 | 9:07 PM

Share

పై ఫొటోలో కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తన అందం, అభినయంతో సినీ ఆడియెన్స్ మనసులను కొల్లగొట్టింది. ముఖ్యంగా కళ్లతోనే ఆమె పలికించే ఎక్స్ ప్రెషన్స్ కు అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 సినిమాల వరకు చేసిందీ అందాల తార. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే చాలా మంది హీరో హీరోయిన్లలాగే ఈ అందాల తార కూడా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. దీంతో క్రమంగా సినిమాలకూ దూరమైంది. ఆ తర్వాత పిల్లల పెంపకంలో బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారిపోయిందామె. నిత్యం కుకింగ్ వీడియోలు,వర్కవుట్స్, ఫిట్ నెస్ టిప్స్ చెబుతూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. అలా ఆ అందాల తారకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరి పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పటి తరానికి పెద్దగా ఆమె పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1990 వ దశకంలో ఈ హీరోయిన్ అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆమె సీతాకోక చిలుక సినిమా హీరోయిన్ ముచ్చెర్ల అరుణ.

1981లో దిగ్గజ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన సీతాకోక చిలుక సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అరుణ. తొలి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అరుణ పలికించిన ఎక్స్ ప్రెషన్స్, అమాయకత్వం ఇలా అన్నీ అప్పటి కుర్రకారును ఫిదా చేశాయి. దీన తర్వాత చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో ఓవరాల్ గా 76 సినిమాల్లో నటించింది అరుణ.

ఇవి కూడా చదవండి

సీతాకోక చిలుక సినిమాలో అరుణ..

కాగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవెత్త మోహన్ గుప్తాను వివాహం చేసుకుంది అరుణ . ఇక పెళ్లి అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోందీ అందాల తార. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. వర్కవుట్స్, వంటకాలు, కుకింగ్ టిప్స్, హెల్త్ అండ్ ఫిట్ నెస్ టిప్స్ చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు