- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya With His Father In Law Venkatesh and Daggubati Family Photos Goes Viral
Naga Chaitanya – Venkatesh: అల్లుడిని పెళ్లి కొడుకుగా రెడీ చేసిన వెంకీ మామ.. ఫోటోస్ వైరల్..
అక్కినేని నాగార్జున తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మెడలో చైతన్య మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీప్రముఖులు హాజరయ్యారు.
Updated on: Dec 06, 2024 | 6:36 PM

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చైతన్య, శోభితా పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మామలతో కలిసి చైతన్య సందడి చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీ చైతన్యను పెళ్లి కొడుకును చేస్తోన్న ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

అంతేకాదు హీరో వెంకటేశ్ తన అల్లుడిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తున్న ఫోటోతోపాటు.. దగ్గుబాటి ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ కనిపించారు చైతన్య. చైతన్యకు వెంకటేష్ దిష్టి చుక్క పెట్టారు.

వెంకటేశ్ సోదరి లక్ష్మీ, అక్కినేని నాగార్జున మొదటి భార్య అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కుమారుడే నాగచైతన్య. వెంకటేశ్ కు చైతూ ముద్దుల మేనల్లుడు. వీరిద్దరి కాంబోలో వెంకీ మామ అనే సినిమా కూడా వచ్చింది.




