Pushpa 2: ప్రియుడితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. ఇప్పుడేమో పాన్ ఇండియా స్టార్.. రష్మిక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అంతే

పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్నా పేర్లు మరోసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రష్మక పేరు మార్మోగిపోతోంది. జాతర సీన్స్ లో అల్లు అర్జున్ ని రష్మిక డామినేట్ చేసిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి.

Pushpa 2: ప్రియుడితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. ఇప్పుడేమో పాన్ ఇండియా స్టార్.. రష్మిక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అంతే
సాధారణంగా గ్లామర్ రోల్స్ చేసే బ్యూటీస్‌ కు మంచి పర్ఫామర్ అన్న పేరు రాదు. మంచి పర్ఫామర్‌ గా పేరు తెచ్చుకున్న బ్యూటీస్ గ్లామర్ రోల్స్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించరు. కానీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాత్రం ఈ రెండింటినీ పర్ఫెక్ట్‌ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. దీనికితోడు కాస్త బోల్డ్‌ గా నటించేందుకు కూడా ఓకే అంటుండటంతో సెన్సేషనల్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు ఈ బ్యూటీ.
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2024 | 7:12 PM

పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటనలో అదరగొట్టాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప రాజ్ భార్య శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన అద్భుతమంటున్నారు ఆడియెన్స్. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో బన్నీని రష్మిక డామినేట్ చేసిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యానిమల్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. నేషనల్ క్రష్ గా నార్త్ లోనూ ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిందంటున్నారు సినిమా నిపుణులు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ ప్రయాణమేంటో ఒకసారి చూద్దాం రండి.

కర్ణాటకకు చెందిన రష్మిక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. అలాగే క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది ఇక 2016లోకిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో సాన్వి జొసెఫ్ పాత్రతో అక్కడి ఆడియెన్స్ మనసలు గెల్చుకుంది. ఆ తర్వాత దివంగత పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ (తెలుగుతో గీతా ఛలో) అనే సినిమల్లోనూ హీరోయిన్ గా మెరిసిందీ ముద్దుగుమ్మ

ఛలో తో టాలీవుడ్ కు..

నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు చిత్రం. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన గీతా గోవిందం ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాని, నాగార్జునతో కలిసి నటించిన దేవ దాస్ యావరేజ్ గా నిలిస్తే.. విజయ్ దేవరకొండతో మళ్లీ నటించిన డియర్ కామ్రేడ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో రష్మిక పోషించిన లిల్లీ పాత్ర చాలామందికి తెగ నచ్చేసింది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో కలిసి భీష్మ వంటి కమర్షియల్ హిట్ చిత్రాల్లోనూ నటించింది రష్మిక. ఇక 2021లో కార్తీతో కలిసి సుల్తాన్ అనే సినిమాతో మొదటిసారి తమిళ గడప తొక్కింది. . అదే ఏడాది పుష్ప తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ తో కలిసి ఆడియెన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ సీతారామంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది.

బాలీవుడ్ లోనూ పాగా..

గుడ్ బై సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన రష్మిక యానిమల్ సినిమాలో రణ్ బీర కపూర తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ మూవీ ఏకంగా రూ.900 కోట్లు రాబట్టింది. అంతకు ముందు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించిన వారసుడు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే మిషన్ మజ్ను లో అంధురాలిగా రష్మిక అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఇప్పుడు పుష్ప 2 మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది రష్మిక. అభినయం పరంగా మొదటి పార్ట్ తో పోల్చితే ఇందులో రష్మిక స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ. ప్రస్తుతం రష్మిక ఖాతాలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ధనుష్, నాగార్జునలతో కుబేర, రెయిన్ బో తో పాటు పలు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

కాగా 2017లోనే రిషబ్ శెట్టితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది రష్మిక. అయితే కొన్ని కారణాలతో ఆ తర్వాత  దానిని రద్దు చేసుకుంది.  ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం రష్మికకు ఈ రేంజ్, క్రేజ్ ఫాలోయింగ్ వచ్చి ఉండేది కాదేమో!

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..