AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఐష్‏తో లవ్ బ్రేకప్.. ఆపై ఇండస్ట్రీలో బ్యాన్.. ఇప్పుడు రూ.1200 కోట్లకు యజమాని..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‏తో లవ్, బ్రేకప్ అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అతడు ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యాడు. కానీ తనదైన నటనతో జనాల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు రూ.1200 కోట్లకు యజమాని.

Tollywood : ఐష్‏తో లవ్ బ్రేకప్.. ఆపై ఇండస్ట్రీలో బ్యాన్.. ఇప్పుడు రూ.1200 కోట్లకు యజమాని..
Actor New
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2024 | 6:52 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు బ్యాన్ చేయబడ్డారు. కొందరు ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యారు. కానీ ఓ నటుడు మాత్రం ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసినా.. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాడు. జనాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. బీటౌన్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో ప్రేమ, బ్రేకప్ అతడి జీవితాన్ని మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. అతడు మరెవరో కాదు.. బీటౌన్ హీరో వివేక్ ఒబెరాయ్. ఇటీవలే అతడు కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అతడి ఆస్తి రూ.1200 కోట్లకు పైగానే ఉంటుంది.

వివేక్ ఒబెరాయ్.. సినీరంగంలో అంత సులభంగా ఎదగలేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ అనేక సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్నాడు. 2002లో ఒక కంపెనీని స్థాపించి, అదే ఏడాది బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. సాథియా, మస్తీ, ఓంకార వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

అప్పట్లో సల్మాన్ ఖాన్ ఈ హీరోను టార్గెట్ చేశాడని.. దీంతో చిత్రపరిశ్రమ మొత్తం అతడికి ఎదురుతిరిగిందని ప్రచారం నడిచింది. ఫలితంగా వివేక్ కెరీర్ దెబ్బతింది. అతడిని ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ సినిమాను వదిలిపెట్టలేదు. తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వివేక్ ఒబెరాయ్ సినిమా రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా పేరు సంపాదించాడు. ‘కర్మ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని, ‘మెగా ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించాడు. అలాగే రస్ అల్ ఖైమాలో ఉన్న రూ. 2,300 కోట్ల ప్రాజెక్ట్ ‘ఆక్వా ఆర్క్’ వ్యవస్థాపకుడు. అంతేకాకుండా చాలా స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు తన విజయాలతో కొత్త శిఖరాలను చేరుకున్నాడు.

View this post on Instagram

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.