AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bloody Beggar OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ..

ఈ వీకెండ్‌లో వినోదం పంచేందుకు ఓటీటీలోకి మరో సినిమా వచ్చేసింది. కోలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ డిఫరెంట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Bloody Beggar OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కానీ..
Bloody Beggar Movie
Basha Shek
|

Updated on: Dec 08, 2024 | 10:52 AM

Share

‘జైలర్’ దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ సినిమా ‘బ్లడీ బెగ్గర్’. కెవిన్ ఇందులో హీరోగా నటించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. పెద్దగా కలెక్షన్లు రాకపోయినా కథ కథనాల పరంగా ప్రశంసలు అందుకుంది. అందుకే మరో వారానికే అంటే నవంబర్ 07న తెలుగులో కూడా బ్లడీ బెగ్గర్ సినిమా రిలీజైంది. అయితే ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అసలు బ్లడీ బెగ్గర్ సినిమా తెలుగులో రిలీజైందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బ్లడీ బెగ్గర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 29న తమిళ వెర్షన్ ను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ప్రస్తుతానికి మన దేశంలో తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో బ్లడీ బెగ్గర్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో భారత్ లోన బ్లడీ బెగ్గర్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన బ్లడీ బెగ్గర్ సినిమాలో రాధా రవి, రెడిన్ కింగ్ స్లే, పృథ్వీ రాజ్, మిస్ సలీమా, కార్తీక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జెన్ మార్టిన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. కళ్లు, కాళ్లు లేని వాడిలా నటిస్తూ అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటుంటాడు కెవిన్. ఓ రోజు అనుకోకుండా బంగ్లాలోకి వెళ్లి అక్కడే ఇరుక్కుపోతాడు. మరి తర్వాత ఏమైంది? బంగ్లా లో ఉండేవారు ఈ బెగ్గర్ ను ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.

అమెజాన్ ప్రైమ్ లో ఒరిజినల్ వెర్షన్

సన్ నెక్ట్స్ లో బ్లడీ బెగ్గర్ తెలుగు వెర్షన్.. త్వరలోనే స్ట్రీమింగ్ కు..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
మారుతి సుజుకి నుంచి సరికొత్త 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్'.. ఎప్పుడంటే
మారుతి సుజుకి నుంచి సరికొత్త 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్'.. ఎప్పుడంటే
జానీ మాస్టర్ కు 'సహాయ నిరాకరణ' పనిష్మెంట్
జానీ మాస్టర్ కు 'సహాయ నిరాకరణ' పనిష్మెంట్