Pushpa 2: పుష్ప 2 సినిమాను వీక్షించిన వేణు స్వామి.. రాబోయే 15 ఏళ్లలో అల్లు అర్జున్ జాతకం ఇదేనట!

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బన్నీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను వీక్షిస్తున్నారు.

Pushpa 2: పుష్ప 2 సినిమాను వీక్షించిన వేణు స్వామి.. రాబోయే 15 ఏళ్లలో అల్లు అర్జున్ జాతకం ఇదేనట!
Venuswamy, Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2024 | 4:21 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. డిసెంబర్ 05న విడుదలైన ఈ మూవీ మొదటి రోజే ఏకంగా రూ.295 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా పుష్ప 2 రికార్డుల కెక్కింది. సినీ అభిమానులు, సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుష్ప 2 సినిమాను వీక్షిస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పుష్ప సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సినిమాపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో పంచుకున్నారు. ‘ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసి వచ్చాను. రాజమాతంగి గెటప్‌లో బ్లూ కలర్ చీరలో జాతర సీన్స్ లో అల్లు అర్జున్‌ ఇరగదీశారు. ఆయన అసలైన సూపర్‌స్టార్‌’ అని ప్రశంసలు కురిపించారు వేణు స్వామి. ఈ సందర్భంగానేగతంలో పలు చానెళ్లకు అల్లు అర్జున్‌ గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూపించారు. నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన సినిమాలు వందల కోట్లు వసూళ్లు చేస్తాయి. మరో 15 ఏళ్లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేదు. బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలు ఎవరూ కూడా నష్టపోరు’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు వేణు స్వామి.

కాగా గతంలోనే పుష్ప-2 సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన వేణు స్వామి, ఇప్పుడు మళ్లీ పుష్ప-2 సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన బన్నీ అభిమానులు వేణు స్వామిని తెగ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి రిలీజ్ చేసిన వీడియో..

ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్, జగదీష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీలీల ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేసింది.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.