Unstoppable with NBK S4:ఆ స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో హీరోగా నటించాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది . సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ టాక్ షోకు వచ్చి తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల, జాతిరత్నం నవీన్ పొలిశెట్టి హాజరయ్యారు.

Unstoppable with NBK S4:ఆ స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో హీరోగా నటించాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన బాలయ్య
Unstoppable with NBK S4
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2024 | 5:15 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే ఈ షో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా రన్ అవుతోంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, నాలుగు, ఐదో ఎపిసోడ్స్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు. ఇక ఆరో ఎపిసోడ్ కు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల, జాతి రత్నం నవీన్ పొలిశెట్టి అతిథులుగా వచ్చారు. శుక్రవారం (డిసెంబర్ 06) రాత్రి నుంచే ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కు స్పేస్ సైంటిస్ట్‌ తరహాలో ముస్తాబై వచ్చాడు బాలయ్య. ఇక అతిథులు నవీన్, శ్రీలీలతో సరదాగా ముచ్చటించి ఆడియెన్స్ ను అలరించారు. ఈ సందర్భంగా ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ రానుందని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు బాలయ్య. తన కుమారుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఇందులో నటిస్తాడని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు.

ఇదే షోలో రాజమౌళి, సందీప్‌రెడ్డి వంగ.. ఎవరి సినిమాలో హీరోగా చేయాలని ఉందని బాలకృష్ణను అడిగాడు నవీన్. ఇందుకు ఆయన సమాధానమిస్తూ ‘రాజమౌళిగారు ప్రస్తుతం మహేశ్‌బాబు తో మూవీ చేస్తున్నారు. వాళ్లిద్దరూ మరో మూడు నాలుగేళ్లు బిజీ. సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌ తో సినిమాతో రెండేళ్ల వరకు బిజీగా ఉంటాడు. అంటే ముందు సందీప్‌ ఫ్రీ అవుతారు కాబ్టటి ఆయన్ను ఇంప్రెస్‌ చేసి, ఛాన్స్‌ కొట్టేస్తా. తరువాత రాజమౌళితో కూడా మూవీ చేస్తా’ అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే ‘నాకైతే రాజమౌళి సినిమాలో హీరోగా చేసి, సందీప్‌ వంగ మూవీలో విలన్‌గా చేయాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు బాలయ్య.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

ఇక శ్రీలీల, నవీన పొలిశెట్టి కూడా తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కోసం అమ్మ 20 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసిందని శ్రీలీల ఎమోషనల్ అయ్యింది. ఇలా ఎన్నో ఆసక్తికర విశేషాలతో కూడిన ఈ ఎపిసోడ్‌ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

బాలయ్య అన్ స్టాపబుల్  ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.