AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Polishetty: సాయి పల్లవి, రణబీర్ కపూర్ రామాయణంలో నవీన్ పోలిశెట్టి.. బాలయ్య షోలో క్లారిటీ ఇచ్చిన హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాల్లో, బయట అందరినీ నవ్విస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు నవీన్. తాజాగా బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు.

Naveen Polishetty: సాయి పల్లవి, రణబీర్ కపూర్ రామాయణంలో నవీన్ పోలిశెట్టి.. బాలయ్య షోలో క్లారిటీ ఇచ్చిన హీరో..
Naveen Polishetty
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2024 | 3:45 PM

Share

యూట్యూబ్ లో షార్ట్స్ ఫిలిమ్స్ ద్వారా నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించి నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించాడు. ఆ తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నవీన్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి తన ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాడు. ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో శ్రీలీలతో కలిసి సందడి చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ షోలో ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే నవీన్ ను బాలయ్య ప్రశ్నిస్తూ.. బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తోన్న రామాయణంలో నువ్వు లక్ష్మణుడి పాత్ర చేస్తున్నావని వార్తలు వినిపించాయి. నిజమేనా అని అడగ్గా.. నవీన్ మాట్లాడుతూ.. “ఇలాంటి రూమర్స్ వినడానికి బాగుంటాయి. నిజమైతే ఇంకా బాగుండు. ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వ్యాప్తి చేయండి. అప్పుడైనా నాకు అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో అవకాశాలు వస్తే బాగుంటుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు నవీన్. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!