- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Chitra Shukla Shares Her Marriage Photos On Her Wedding Anniversary
Tollywood: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభంచింది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గానూ అదృష్టం పరీక్షించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
Updated on: Dec 07, 2024 | 9:46 PM

మధ్య ప్రదేశ్ కు చెందిన చిత్ర శుక్లా మా అబ్బాయి అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది. 2017లో రిలీజైన ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు.

దీని తర్వాత రంగుల రాట్నం, సిల్లీ ఫెల్లోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, హంట్, ఉనికి, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, కలియుగం పట్టణంలో తదితర సినిమాల్లో నటించింది చిత్ర

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటించేందుకు రెడీ అయిపోయిందీ ముద్దుగుమ్మ. నా నా అనే మూవీతో కోలీవుడ్ కు పరిచయం కానుంది చిత్ర.

సినిమాల సంగతి పక్కన పెడితే ఈ అందాల తార గతేడాది వైభవ్ ఉపాధ్యాయ్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది.

తాజాగా మొదటి పెళ్లి రోజును పురస్కరించుకుని తన హల్దీ, మెహందీ పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు షేర్ చేసింది చిత్ర శుక్లా.

దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు విషెస్ చెబుతున్నారు.





























