Pushpa 2: పుష్ప 2 సినిమా చూసిన వేణు స్వామి భార్య.. అల్లు అర్జున్ గురించి ఏం చెప్పారో మీరే చూడండి.. వీడియో
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప 2. డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను చూసేందుకు సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అలాగే సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. డిసెంబర్ 05న విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విశేషమేమిటంటే బన్నీ అభిమానులతో సగటు సినీ ప్రేక్షకులు కూడా పుష్ప 2 సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు పుష్ప 2 సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పుష్ప 2 సినిమాను చూసి తన అనుభవాలను ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. తాజాగా ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా పుష్ప 2 సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా గురించి అల్లు అర్జున్ అభినయం గురించి తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. ‘ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసేసి వస్తున్నాను. ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడే మాటలు బాగా వస్తాయి. ఏదైనా నచ్చినా, నచ్చకపోయినా నాకు సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటు. కళామతల్లి ఆశీస్సులు అల్లు అర్జున్ పై ఉన్నాయి. ఈ సినిమాలో నేను ఆయన నట విశ్వరూపం చూశాను. కళామ తల్లి ఆశీస్సులుంటే తప్ప ఇలాంటి నటన సాధ్యం కాదు. అల్లు అర్జున్ గారు.. మీకు ఇప్పట్లో తిరుగు లేదు. ఒక వంద గుమ్మడి కాయల దిష్టి తీసుకోండి’.
‘ఇక సుకుమార్ గారు.. అంత సింపుల్ గా, ఇన్నోసెంట్ గా ఉండి.. ఎలా తీశారు ఈ మూవీని. ఆ ట్విస్టులు.. ఆ సీక్వెన్సులు.. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్న మాట మీలాంటి వారిని చూసే అంటారేమో! నా జీవితంలో మొదటిసారి సినిమా అప్పుడే అయిపోయిందా? అనిపించింది. ఇంకా చూడాలనిపించింది. అల్లు అర్జున్ గారు ఆల్ ది బెస్ట్.. రెండో నేషనల్ అవార్డు తీసుకోవడానికి రెడీగా ఉండండి’ అని పుష్ప 2 టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పారు వీణా శ్రీవాణి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
వేణు స్వామి భార్య షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
అంతకు ముందు వేణు స్వామి పుష్ప 2 సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సినిమాపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో పంచుకున్నారు. ‘ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసి వచ్చాను. రాజమాతంగి గెటప్‌లో బ్లూ కలర్ చీరలో జాతర సీన్స్ లో అల్లు అర్జున్ ఇరగదీశారు. ఆయన అసలైన సూపర్‌స్టార్’ అని ప్రశంసలు కురిపించారు.
వేణు స్వామి మాటల్లో అల్లు అర్జున్ జాతకం..
View this post on Instagram
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.