Pushpa 2: అల్లు అర్జున్‌ను ఎలా నిందిస్తారు? పుష్ప 2 ప్రీమియర్స్‌లో మహిళ మృతిపై రామ్ గోపాల్ వర్మ

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై వరుసగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన సంధ్య థియేటర్ ఘటనపై కూడా ట్వీటేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Pushpa 2: అల్లు అర్జున్‌ను ఎలా  నిందిస్తారు? పుష్ప 2 ప్రీమియర్స్‌లో మహిళ మృతిపై రామ్ గోపాల్ వర్మ
Allu Arjun, Ram Gopal Varma
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2024 | 11:43 AM

పుష్ప-2 ప్రీమియర్స్ లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి(35)తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. ఇది వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక పుష్ప 2 చిత్ర బృందం కూడా రేవతి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాజాగా సంధ్య థియేటర్‌ ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్‌ ను తప్పు పట్టడం, నిందించడం హాస్యాస్పదమని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందులో షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

‘గతంలో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ సమావేశాలు లేదా మేళా నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి దురదృష్ట ఘటనలు జరిగాయి. అలాగనీ సమావేశాలు, మేళాలు నిషేధిస్తున్నారా? బెనిఫిట్‌ షోలను బ్యాన్‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. హీరోలు థియేటర్లలో సినిమాలు చూడడమనేది చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఇది కొత్తేమీ కాదు. ఈ సో కాల్డ్ బెనిఫిట్ షోల అసలు ఉద్దేశం ఏమిటంటే, ప్రేక్షకుల్లో ఉన్న హైప్ మరియు క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం, అందరికంటే ముందుగా చూసే థ్రిల్‌ని కలిగించడం. వీటి ద్వారా వచ్చిన డబ్బులనే వరదల సహాయార్థం విరాళాలకు ఇచ్చిన రోజులున్నాయి’ అని ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి.

 ఆర్జీవీ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.