- Telugu News Photo Gallery Cinema photos Heroine Aditi Rao Hydari interesting comments on bollywood director sanjay bhansali ideas
Aditi Rao Hydari: ఆయన ఇచ్చిన సలహాను లైఫ్‌లో మర్చిపోలేను.. అదితి కామెంట్స్.!
అదితిరావు హైదరీ.. గ్లామర్ ఇండస్ట్రీలో జస్ట్ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరక్టర్ల సెన్సిబుల్ కేరక్టర్లకు ఫస్ట్ చాయిస్ ఆమే అన్నది ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఫిదా చేస్తున్న విషయం. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లోనే కనిపించారు అదితిరావు హైదరీ. రీసెంట్‌గా సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఈ బ్యూటీ.
Updated on: Dec 09, 2024 | 11:27 AM

అదితిరావు హైదరీ.. గ్లామర్ ఇండస్ట్రీలో జస్ట్ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరక్టర్ల సెన్సిబుల్ కేరక్టర్లకు ఫస్ట్ చాయిస్ ఆమే అన్నది ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఫిదా చేస్తున్న విషయం.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లోనే కనిపించారు అదితిరావు హైదరీ. రీసెంట్‌గా సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు ఈ బ్యూటీ.

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని కంటిన్యూ చేస్తానని చెప్పేశారు అదితి. సౌత్‌లో సెన్సిబుల్ డైరక్టర్లతో పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ముఖ్యంగా మణి సార్ సెట్స్ లో ఉంటే, ప్రతి రోజూ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి వెళ్లినట్టే ఉంటుంది.

ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంటుంది.. నేర్చుకున్న విషయాలను అక్కడ ప్రాక్టికల్‌గా చేస్తున్నట్టు అనిపిస్తుందని అంటారు అదితి. సౌత్‌లో మణిరత్నంని ఎంత అభిమానిస్తారో, నార్త్ లో సంజయ్ లీలా భన్సాలీ అంటే అంత ఇష్టం అదితికి.

రీసెంట్‌గా హీరామండిలో బిబ్బోజాన్ కేరక్టర్ చేసిన రోజులు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయని అంటున్నారు మిసెస్ సిద్ధార్థ్.

హీరామండిలో భావోద్వేగాలు పండించే సన్నివేశాల కోసం ఆకలితో ఉండమని సంజయ్ ఇచ్చిన సలహాను లైఫ్‌లో మర్చిపోలేనన్నది అదితి మాట.

జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసిన వారు మాత్రమే అలాంటి సలహాలు ఇవ్వగలరని, తాను కూడా లైఫ్‌ని అంతే సెన్సిబుల్‌గా డీల్ చేయాలని అనుకుంటున్నాని చెప్పారు అదితి.




