- Telugu News Photo Gallery Cinema photos Hero Balakrishna announce on aditya 369 sequel with his son mokshagna in Tollywood, Details Here
Balakrishna: బాల ఇది నీకే సాధ్యం.! ఏదైనా నేను దిగనంత వరకే.. బాలయ్య మార్క్.!
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సిక్స్ టీ ప్లస్ ఏజ్‌లో సెల్ఫ్ రూల్స్ క్రియేట్ చేసి, వాటికి తగ్గట్టు తన టీమ్‌ని రూల్ చేసే అవకాశం ఉన్నా.. తీసుకోవడం లేదు ఆయన. ఎంత సేపూ నెక్స్ట్ ఏంటి? అంటూ పరుగులు తీస్తున్నారు. నందమూరి అందగాడు బాలకృష్ణ పెడుతున్న పరుగులు చూస్తుంటే, చుట్టూ ఉన్న కుర్రకారుకి రెట్టింపు ఉత్సాహం వస్తోంది.
Updated on: Dec 09, 2024 | 12:12 PM

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సిక్స్ టీ ప్లస్ ఏజ్‌లో సెల్ఫ్ రూల్స్ క్రియేట్ చేసి, వాటికి తగ్గట్టు తన టీమ్‌ని రూల్ చేసే అవకాశం ఉన్నా... తీసుకోవడం లేదు ఆయన.

ఎంత సేపూ నెక్స్ట్ ఏంటి? అంటూ పరుగులు తీస్తున్నారు. నందమూరి అందగాడు బాలకృష్ణ పెడుతున్న పరుగులు చూస్తుంటే, చుట్టూ ఉన్న కుర్రకారుకి రెట్టింపు ఉత్సాహం వస్తోంది.

ఇన్ని పనులనూ ఇలా ఎలా చేయగలుగుతున్నారన్ని ఆశ్చర్యపోతున్నారు. ఆల్రెడీ అన్‌స్టాపబుల్ నయా సీజన్‌తో దూసుకుపోతున్నారు బాలయ్య. సంక్రాంతి రిలీజుల రేసులో ఉంది డాకు మహరాజ్.

బాబీ డైరక్ట్ చేసిన ఈ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి నందమూరి సర్కిల్స్ లో. ఎన్నికల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది కానీ, లేకపోతే 2024లోనే సందడి చేయాల్సింది డాకు మహరాజ్.

రీసెంట్‌గా ఈ మూవీ షూట్ కంప్లీట్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అఖండ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరుమీదున్నాయి. కొత్త సంవత్సరంలో అఖండ 2 తాండవం షూట్ స్టార్ట్ చేసేస్తారు బాలయ్య.

బోయపాటి - బాలయ్య కాంబోలో సినిమా వస్తుందంటే మాకు పండగే అంటున్నారు నందమూరి అభిమానులు. అందులోనూ అది అఖండ2 అయితే, ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవుతుందన్నది వారి కాన్ఫిడెన్స్.

చాలా రోజుల నుంచి నందమూరి అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అఖండ 2పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఆహాలో డిసెంబర్ 6న ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షోలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందులోనూ మోక్ష్‌తో బాలయ్య ఎంత సరదాగా ఉంటారో ఫస్ట్ టైమ్.. ఈ షోలోనే చూడబోతున్నామన్నది అందరిలోనూ కనిపిస్తున్న ఉత్సాహం.




