Bigg Boss 8 Telugu: ఇదేందయ్యా బిగ్‏బాసూ.. ఇలా చేతులేత్తేసావ్.. ఫినాలేకు ముందు ఈ గోలేంటయ్యా..

బిగ్‌బాస్ సీజన్ 8 ముగింపుకు ఇంకా కొన్ని రోజుల టైమ్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆటను మరింత ఆసక్తిగా మార్చాల్సిన బిగ్‌బాస్.. ఇప్పుడు వరుస ఎపిసోడ్స్ బోరింగ్ తెప్పిస్తున్నాడు. వరుసగా సీరియల్ బ్యాచ్ ప్రమోషన్స్ తప్ప ఇంకా కనిపించడం లేదు.

Bigg Boss 8 Telugu: ఇదేందయ్యా బిగ్‏బాసూ.. ఇలా చేతులేత్తేసావ్.. ఫినాలేకు ముందు ఈ గోలేంటయ్యా..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2024 | 8:09 AM

బిగ్‌బాస్ సీజన్ 8 శుభం కార్డ్ పడేందుకు రెడీ అయ్యింది. ఇంకా కొన్ని రోజుల్లో ఈ షో క్లైమాక్స్ కు చేరుకోనుంది. ఫినాలేకు ఉన్నది నాలుగు రోజులే అయినా.. ఇప్పటికీ టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోస్ చూపించకుండా వరుసగా సీరియల్ బ్యాచ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా సీరియల్ టీం యాక్టర్స్ వస్తూ ఇంట్లో సందడి చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్, నబీల్ కలిసి పాలకూర బజ్జీలు చేశారు. వాటిని ఒక కప్పులో వేసి బిగ్‌బాస్ కు పంపించారు. స్టోర్ రూంలో వాళ్లిద్దరూ పెట్టిన బజ్జీలు తినేసి.. తక్కువ పంపించారంటూ ఓ లేఖ పంపించాడు. దీంతో మరికొన్ని బజ్జీలు చేసి పంపించారు నబీల్, అవినాష్. అవి కూడా సరిపోలేదంటూ చిటీ పంపించాడు. ఇక బిగ్‌బాస్ పంపించిన చిటీ కెమెరాకు చూపిస్తూ అవినాష్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి. ఆ తర్వాత హౌస్ లోకి వంటలక్క సీరియల్ బ్యాచ్ వచ్చింది. ఇక్కడ అవినాష్ కామెడీతో అదరగొట్టాడు.

ఆ తర్వాత బీబీ పరివారం, స్టార్ మా పరివారం మధ్య ఓ టాస్కు పెట్టగా.. ఇందులో ప్రేరణ, అవినాష్ గెలిచి విన్నర్ ప్రైజ్ మనీకి రూ.10 వేలు యాడ్ చేశారు. ఆ తర్వాత నభీల్, అవినాష్ మరిన్ని బజ్జీలు ఇచ్చేందుకు స్టోర్ రూంకు వెళ్లగా.. అక్కడ హౌస్మేట్స్ కోసం కూల్ డ్రింక్స్, పిజ్జాలు కనిపించాయి. చాలారోజుల తర్వాత బిగ్‌బాస్ అంత ప్రేమ చూపించడంతో ప్రేరణ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కాసేపటికి మగువా ఓ మగువా సీరియల్ బ్యాచ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ హీరోహీరోయిన్లు జనాలకు అంతగా తెలియదు.

వీళ్లతోనూ ఓ గేమ్ ఆడించాడు బిగ్ బాస్. అయితే వచ్చిన ప్రతి సీరియల్ బ్యాచ్ ఉన్న ఒక్క అమ్మాయి అంటూ ప్రేరణకు వరుస ఛాన్సులు ఇస్తున్నారు. దీంతో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది ప్రేరణ. ఈ టాస్కులో ప్రేరణ, గౌతమ్ గెలిచి ప్రైజ్ మనీకి రూ.10 వేలు యాడ్ చేశారు. చివరకు ఈ సీరియల్ బ్యాచ్ కూడా బైబై చెప్పేసింది. వరుసగా రెండు మూడు రోజులుగా హౌస్ లో ఇదే తంతు జరుగుతుంది. సీరియల్ బ్యాచ్ రావడం.. గేమ్స్ ఆడి వెళ్లిపోవడంతో బిగ్‌బాస్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మరింత బోరింగ్ గా ఉన్నాయంటూ పెదవి విరుస్తున్నారు అడియన్స్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.