- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Comedian Yadamma Raju Wife Stella Maternity Photoshoot Goes Viral
Jabardasth Yadamma Raju: తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు.. భార్య మెటర్నిటీ ఫొటో షూట్ చూశారా?
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య స్టెల్లా త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా స్టెల్లా మెటర్నీటీ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యాదమ్మ రాజు.
Updated on: Dec 11, 2024 | 3:42 PM

ఒక సాధారణ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు యాదమ్మ రాజు. పటాస్ టీవీషోలో కామెడీ స్కిట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత టాప్ కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం టీవీ షోస్‌తో పాటు వెండితెరపైనా కనిపిస్తున్నాడీ స్టార్ కమెడియన్.

కాగా యాదమ్మ రాజు సుమారు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడీ జంట మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తోంది.

ప్రస్తుతం స్టెల్లా గర్బంతో ఉంది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డను ప్రసవించనుంది. ఈ క్రమంలోనే స్టెల్లా మెటర్నీటీ ఫొటో షూట్ జరుపుకొంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు యాదమ్మ రాజు. దీంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి

ఈ ఫొటోలను చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు- స్టెల్లా దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.




