AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 : ‘ఆ క్రెడిటంతా జగనన్నదే’.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై రోజా రివ్యూ

సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పుష్ప 2 సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆర్ కే రోజా పుష్ప 2 సినిమాను చూసింది. అనంతరం ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాలను పంచుకుంది.

Pushpa 2 : 'ఆ క్రెడిటంతా జగనన్నదే'.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై రోజా రివ్యూ
Allu Arjun, RK Roja
Basha Shek
|

Updated on: Dec 11, 2024 | 7:21 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఐకాన్ స్టార్ సినిమాను చూస్తున్నారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా పుష్ప 2 సినిమాను వీక్షించింది. అనంతరం అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ వరుసగా ట్వీట్లు చేసింది. ‘వేటూరి గారు ఒక ఇంటర్వ్యూ లో అంటారు. ‘అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి`అని. లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు మీ సినిమాతో. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక్క భాష – యాసకే కాదు వేషానికి కూడ 100% న్యాయం చేయించారు నటీనటులతో. మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరు ఊరంతా.. రేయ్ మచ్చా ఎవుడ్రా ఈడు అని మాట్లాడుకునేలా చేశారు. బాక్సాఫీస్ బద్ధలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగమమ్మ జాతరను జగనన్న నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది అత్యంత వైభవంగా జరిపించింది. మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్‌ పెర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్ పై‌ అద్భుతంగా చేసి చూపించారు.. ఇక రష్మిక సూపర్’ అంటూ అని ట్వీట్ చేసింది రోజా.

ఇక మరో ట్వీట్ లో ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప2 నిజంగా అంచనాలు మించిన చిత్రం‌.. పుష్పతో తగ్గేదేలే అన్నారు.. పుష్ప2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు.. మా చిత్తూరు యాస వెండి తెరపై పలికిన తీరు హాల్ లో ఈలలు వేయిస్తోంది అల్లు అర్జున్ గారు మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్ తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్..వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు, మా తిరుపతి గంగ జాతర సీన్ హైలైట్ శభాష్ బన్నీ అనిపించింది.. మీ శ్రమకి ఫలితమే మీ చిత్ర విజయం, మొత్తం యూనిట్ కి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది రోజా. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

రోజా ట్వీట్స్..

అల్లు అర్జున్ అదరగొట్టాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.