Dhanush: మరో హాలీవుడ్‌ సినిమా చేయనున్న ధనుష్.. హీరోయిన్‌గా క్రేజీ హాట్ బ్యూటీ

తమిళ్ హీరో ధనుష్ సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. అలాగే తెలుగు, తమిళ్, హిందీ భాషలతో హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు ధనుష్.

Dhanush: మరో హాలీవుడ్‌ సినిమా చేయనున్న ధనుష్.. హీరోయిన్‌గా క్రేజీ హాట్ బ్యూటీ
Danush
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2024 | 7:27 PM

తమిళ స్టార్ హీరో ధనుష్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భాషలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. తమిళ నటుడే అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల్లో నటించి పెద్ద హిట్స్ ఇచ్చాడు. అలాగే తెలుగులోనూ నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ధనుష్ ఇప్పటికే హాలీవుడ్ లో స్టార్ నటులతో నటించాడు. హాలీవుడ్‌లో సోలో హీరోగా నటించలేదు. ఇప్పుడు ధనుష్ మరోసారి హాలీవుడ్‌కి వెళ్లబోతున్నాడు. ఈసారి ధనుష్ సరసన ప్రముఖ నటి ప్రధాన పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ధనుష్ 2019లో విడుదలైన ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్’ అనే హాలీవుడ్ మూవీలో నటించారు. ఆ తర్వాత హాలీవుడ్‌లోని బిగ్గెస్ట్ స్టార్స్‌తో మార్వెల్‌కి చెందిన ప్రముఖ రోస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘ది గ్రే మ్యాన్’ చిత్రంలో ధనుష్ కీలక పాత్రను పోషించాడు. ధనుష్ ఇప్పుడు మూడోసారి హాలీవుడ్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

‘స్ట్రీట్ ఫైటర్’ అనే హాలీవుడ్ సినిమాలో ధనుష్ నటించనున్నాడు. సోనీ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ హాట్ బ్యూటీ క్వింటన్ టరాన్టినో దర్శకత్వం వహించిన ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’తో సహా అనేక పాపులర్ హాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

ధనుష్ ప్రస్తుతం ‘కుబేర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక మందన్న కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే తమిళ్ లో ‘ఇడ్లీ కడై’ అనే చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు ధనుష్ ఇళయరాజా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి అరుల్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహించనున్నాడు. హిందీలో కూడా ఓ సినిమా రెడీ చేస్తున్నాడు. గతంలో వచ్చిన ‘రాంఝానా’ చిత్రాన్ని రూపొందించిన టీమ్‌తోనే మళ్లీ ధనుష్ కలిసి పని చేయనున్నాడు. ఇలా ధనుష్ తెలుగు, తమిళ్, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.