AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murali Sharma: ఇదేందయ్యా ఇది..! ఈ విలన్ గారి భార్య.. ఓ స్టార్ నటి అని మీకు తెలుసా..!

ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు మురళీ శర్మ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన మురళీ శర్మ, హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా నటించాడు.

Murali Sharma: ఇదేందయ్యా ఇది..! ఈ విలన్ గారి భార్య.. ఓ స్టార్ నటి అని మీకు తెలుసా..!
Murali Sharma
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2024 | 6:41 PM

Share

సినిమాల్లో తమ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ పాత్రతో సినిమాకు ఎంతో ప్లస్ అవుతూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్న కొన్ని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ. ఈ వర్సటైల్ యాక్టర్ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. పలు సినిమాల్లో విలన్ గా మెప్పించిన మురళి శర్మ ఆతర్వాత సహాయక పాత్రల్లో కనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో ఖైజర్ గా తన విలనిజంతో మెప్పించారు మురళీ శర్మ.

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

విలన్ గానే కాదు.. తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అలా వైకుంఠపురంలో సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.  మురళీ శర్మ గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. మురళీ శర్మ టీవీ సీరియల్స్‌లో నటించి సినిమాల్లోకి వచ్చారు. మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజ్ లో నటించారు. ఆ తర్వాత షారుఖ్‌ఖాన్ మైహూనా లో నటించి మెప్పించారు. ఇక తెలుగులో మహేష్ అతిథి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు మురళీ శర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఈ వర్సటైల్ యాక్టర్.

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

మురళీశర్మనే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటించారు. ఆమె కూడా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మురళీ శర్మ భార్య పేరు.. అశ్వినీ కల్‌శేఖర్. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా ఆమె నటించారు. ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అశ్వినీ కల్‌శేఖర్ మరాఠీ టెలివిజన్, హిందీ సినిమా, టీవీ సీరియల్స్ లో ఎక్కువగా నటించారు. తెలుగులో బ్రదినాథ్ సినిమాతో పాటు రవి తేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలోనూ విలన్ భార్యగా నటించారు అశ్వినీ కల్‌శేఖర్. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలోనూ అశ్వినీ కల్‌శేఖర్ తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అశ్వినీ కల్‌శేఖర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య అశ్వినీ కల్‌శేఖర్ హిందీలో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు.

Murali Sharma Wife

Murali Sharma Wife

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..