- Telugu News Photo Gallery Cinema photos Super Star Rajinikanth Focus on North with north artists in his next movies, Details Here
Rajinikanth: తలైవా ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే.! అదే సెంటిమెంట్‌ను మళ్లీ రిపీట్..
సూపర్ స్టార్ రజనీకాంత్ నార్త్ మార్కెట్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. అందుకే తన ప్రతీ సినిమాలో నార్త్ స్టార్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఆల్రెడీ చేసిన సినిమాల విషయంలోనే కాదు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు, త్వరలో స్టార్ట్ అవ్వబోయే సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు తలైవా. అవుట్ అండ్ అవుట్ సౌత్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న రజనీకాంత్, తన ప్రతీ సినిమాలో నార్త్ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Updated on: Dec 10, 2024 | 6:58 PM

అందుకోసం ఆయన కొన్నాళ్ల పాటు మేకోవర్ టైమ్ తీసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు రజనీకాంత్. కూలీ షూటింగ్ పూర్తి కాగానే, ఇమీడియేట్‌గా జైలర్2 సెట్స్ కి వెళ్లడం లేదు.

రేపటి గురించి కలలు అలాగే మిగిలిపోతాయని బాగా తెలుసు సూపర్‌స్టార్‌కి. అందుకే పని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. జైలర్‌తో ఫుల్ పామ్‌లోకి వచ్చేశారు తలైవర్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అవుట్ అండ్ అవుట్ సౌత్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న రజనీకాంత్, తన ప్రతీ సినిమాలో నార్త్ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జైలర్ 2 క్యారక్టర్ ప్రిపరేషన్ కోసం టైమ్ స్పెండ్ చేయాలని ఫిక్సయ్యారు. సో.. బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు దద్దరిల్లుతాయన్నది తలైవర్ కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం.

బ్లాక్ బస్టర్ జైలర్‌లో బాలీవుడ్ టచ్ మిస్ అయినా.. లేటెస్ట్ మూవీ వేట్టయన్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌నే రంగంలోకి దించారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న కూలీ సినిమాలోనూ ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కనిపించబోతున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది.

కూలీ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నది సౌత్, నార్త్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్. త్వరలో స్టార్ట్ అవ్వబోయే జైపూర్ షెడ్యూల్‌లోనే ఈ కాంబోకు సంబంధించిన సీన్స్ షూట్ చేయబోతున్నారట.

జైలర్ సినిమాలో కన్నడ, మలయాళ స్టార్స్‌ను గెస్ట్ రోల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న రజనీ, సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్‌ను కూడా రంగంలోకి దించబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరన్నది కన్ఫార్మ్ కాకపోయినా.. రజనీ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయటం మాత్రం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























