- Telugu News Photo Gallery Cinema photos Hero Sundeep Kishan select Tamil movies, Recently He is finalized in Rajinikanth Coolie Movie, Details here
Sundeep Kishan: పేరుకే తెలుగు హీరో.. తమిళం నుంచి మంచి ఆఫర్సే అన్ని.! నెక్స్ట్ కూడ అదే..
పేరుకేమో ఆయన తెలుగు హీరో.. కానీ టాలీవుడ్‌లో అతన్ని వాడుకునే దర్శకులే కరువయ్యారు. ఎంతసేపు తమిళం నుంచి మంచి ఆపర్స్ రావడమే కానీ సొంత ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆయనకు పిలుపందట్లేదు. తాజాగా కోలీవుడ్ నుంచే మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు ఆ హీరో. మరి తెలుగులో తుస్.. తమిళంలో బుసలు కొడుతున్న ఆ హీరో సందీప్ కిషన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.
Updated on: Dec 10, 2024 | 7:19 PM

పేరుకేమో ఆయన తెలుగు హీరో.. కానీ టాలీవుడ్‌లో అతన్ని వాడుకునే దర్శకులే కరువయ్యారు. ఎంతసేపు తమిళం నుంచి మంచి ఆపర్స్ రావడమే కానీ సొంత ఇండస్ట్రీ నుంచి మాత్రం ఆయనకు పిలుపందట్లేదు.

తాజాగా కోలీవుడ్ నుంచే మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు ఆ హీరో. మరి తెలుగులో తుస్.. తమిళంలో బుసలు కొడుతున్న ఆ హీరో సందీప్ కిషన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.

ఇప్పటికే నటుడిగా 25 సినిమాలు పూర్తి చేసుకున్నారీయన. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూనే ఉంటారు కానీ ఇమేజ్ పరంగా మాత్రం తమిళంలోనే సందీప్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది.

ఆఫర్స్ పరంగానూ అక్కడ్నుంచే ఎక్కువగా పలకరిస్తుంటాయి. ఈ మధ్య తెలుగుపై ఎంత ఫోకస్ చేస్తున్నారో.. తమిళంలోనూ అంతే ఫోకస్ చేస్తున్నారు సందీప్ కిషన్.

ఈ క్రమంలోనే ఆ మధ్య ధనుష్ తెరకెక్కించిన రాయన్ సినిమాలో ముత్తువేల్ రాయన్‌గా అదరగొట్టాడు పర్ఫార్మెన్స్. ఇక నిన్నటికి నిన్న హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో సందీప్ కిషనే హీరోగా నటిస్తున్నారు.

తాజాగా తమిళం నుంచి మరో అదిరిపోయే ఆఫర్ సందీప్ కిషన్‌కు వచ్చింది. లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీలో కీ రోల్ చేయబోతున్నారు సందీప్.

లోకేష్ మొదటి సినిమా మానగరంలో సందీప్ కిషనే హీరో. అప్పట్నుంచే ఇద్దరికీ స్నేహం ఉంది. మొత్తానికి తెలుగు కంటే తమిళంలోనే ఈ హీరో కెరీర్ వెలిగిపోతుంది.




