- Telugu News Photo Gallery Cinema photos Prashant Neel focused on Salaar 2 and NTR 31 projects with Bagheera effect.
Prashanth Neel: బఘీరా ఎఫెక్ట్.. డార్లింగ్, తారక్ ప్రాజెక్టులపై నీల్ దృష్టి..
ఓ భారీ సక్సెస్ ఎంత కిక్ ఇస్తుందో, ఓ ఘోరమైన పరాజయం అన్ని విషయాలను నేర్పిస్తుంది. ఈ మధ్య ఈ విషయం గురించి చాలా బాగా తెలుసుకున్నారు ప్రశాంత్ నీల్. ఆయనకు సక్సెస్ ఇచ్చే కిక్ తెలుసు.. ఫెయిల్యూర్ నేర్పించే పాఠం కూడా తెలుసు..
Updated on: Dec 11, 2024 | 8:40 AM

ప్రశాంత్ నీల్ అనే కెప్టెన్‌ని ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా కేజీయఫ్. ఆ కాన్సెప్ట్ మీదున్న నమ్మకంతో సెకండ్ పార్ట్ తీస్తే.. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి చూపించింది ఆ సినిమా. సో.. ఆ తర్వాత బౌండరీలు దాటి సినిమాలు చేయడం మొదలుపెట్టేశారు ఈ కెప్టెన్.

ప్రస్తుతం సలార్2 శౌర్యాంగపర్వం పనుల్లో యమా బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. ఆ మధ్య కాస్త అటూ ఇటూగా ఉన్న ప్రభాస్ కెరీర్‌ని గాడిలో పెట్టింది సలార్ మూవీ. ఈ సినిమా సీక్వెల్ మీద కూడా మాంఛి ఎక్స్ పెక్టేషన్స్ ఉండటంతో వాటిని రీచ్ అయ్యే పనిలో ఉన్నారు నీల్.

మరోవైపు ఖాళీ చేసుకుని మరీ తారక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. రీసెంట్‌గా దేవర సక్సెస్ మీదున్న తారక్.... నెక్స్ట్ చేయబోయే నీల్ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు.

ఒకరికి ఇద్దరు మాస్ హీరోల సినిమాలను డీల్ చేస్తుండటంతో ఫోకస్ పక్కకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు ప్రశాంత్ నీల్. దానికి తోడు రీసెంట్‌గా ఆయన కథ అందించిన బఘీరా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం కావడంతో, ఇక పక్కచూపులు చూడకూడదని ఫిక్సయిపోయారు.

బఘీరా నేర్పిన పాఠంతో డార్లింగ్, తారక్ ప్రాజెక్టుల మీద దృష్టి పెంచేశారు మిస్టర్ నీల్. సలార్ 2, ఎన్టీఆర్ 31 రెండు సినిమాలు కూడా 2025లోనే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ముందు వచ్చేది ఎదో తెలియాల్సి ఉంది.




