Tollywood: ప్రేమలో పడ్డ నాని హీరోయిన్.. ఫోటోలు చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్

సినీ సెలబ్రెటీలు ఈ ఏడాది చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను ప్రారంభిస్తున్నారు. కొంతమంది ప్రేమలో పడ్డాం అని గుడ్ న్యూస్ చెప్తుంటే. మరికొంతమంది ఏకంగా పెళ్లి పీటలెక్కి ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తున్నారు. త్వరలోనే కీర్తిసురేష్ కూడా పెళ్లి చేసుకోనుంది.

Tollywood: ప్రేమలో పడ్డ నాని హీరోయిన్.. ఫోటోలు చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2024 | 4:40 PM

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. హీరోలు, హీరోయిన్స్.. ఈ ఏడాది చాలా మంది పెళ్లిపీటలెక్కారు. రీసెంట్ గానే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ శోభితను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. అలాగే అక్కినేని అఖిల్ కూడా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే అఖిల్ పెళ్లి కూడా జరగనుంది. కాగా ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కూడా ప్రేమలో  పడ్డాను అని చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన అమ్మడు. అందం అభినయం కలబోసిన ఈ కుర్రది ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తొలి సినిమానే నేచురల్ స్టార్ నాని సరసన నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ  మెహ్రీన్ పిర్జాదా. ఈ సినిమాలో బబ్లీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. నాని సినిమాలో అమాయకపు యువతిగా కనిపించి అలరించింది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది ఈ భామ. వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి అందాలతో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ప్రేమలో పడ్డాను అని తెలిపింది. అయితే ఈ అమ్మడు ప్రేమలో పడింది కుర్రాడితో కాదు. ఓ ఏనుగుతో.. అవును తాజాగా మెహ్రీన్ పిర్జాదా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఫుకెట్ లోని గ్రీన్ ఎలిఫెంట్ ఫారెస్ట్ లో పర్యటిస్తుంది ఈ బ్యూటీ. అక్కడ ఏనుగుతో కలిసి కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ ఏనుగుతో ప్రేమలో పడ్డాను అని రాసుకొచ్చింది. దాంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. గతంలో ఈ చిన్నది ఓ మెగా హీరోతో ప్రేమలో పడిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.