AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : శ్రీలీల బాటలో మరో హాట్ బ్యూటీ.. సక్సెస్స్‌లు రాకపోవడంతో ఇలా

డాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ అమ్మడికి సక్సెస్ వచ్చి చాలా కాలమే అయినా.. క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రవితేజ ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ . మధ్యలో భగవంత్ కేసరి సినిమా హిట్ అయినా అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది..

Tollywood : శ్రీలీల బాటలో మరో హాట్ బ్యూటీ.. సక్సెస్స్‌లు రాకపోవడంతో ఇలా
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2024 | 4:59 PM

Share

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో శ్రీలీల ఒకరు. చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కన్నడలో పలు సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. తెలుగులో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్ళిసందడి అనే సినిమాద్వారా పరిచయం అయింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన సినిమా చేసింది. ధమాకా సినిమా భారీ విజయం అందుకోవడంతో శ్రీలీల పేరు మరు మ్రోగిపోయింది. అంతే గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసింది ఈ క్యూటీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది శ్రీలీల. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరితో జతకట్టింది.. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

సక్సెస్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న శ్రీలీల ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. తాజాగా పుష్ప 2లో కిస్సాక్ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శ్రీలీల క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి బాటలోనే మరో హీరోయిన్ కూడా నడుస్తుంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కేతిక శర్మ.

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

ఈ బబ్లీ గర్ల్ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తన అందంతో ఆడియన్స్ ను కళ్ళు తిప్పుకోకుండా చేసింది ఈ హాటీ. ఆతర్వాత వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంది. మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో సినిమాలు చేసిన సాలిడ్ సక్సెస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దాంతో సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంది. ఇక ఇప్పుడు శ్రీలీలలానే స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది కేతిక.  యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో కేతిక స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇటీవలే ఈ అమ్మడి పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ స్పెషల్ సాంగ్ తర్వాత కేతిక క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి.

View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...