Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.. హాట్ బ్యూటీ షాక్
,ఒకప్పుడు హీరోలుగా రాణించింది ఇప్పుడు విలన్స్ గా ఆకట్టుకుంటున్న వారిలో జగపతి బాబు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో జగపతి బాబు హీరోగా మెప్పించారు. అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసారు. లేడీస్ లో జగపతి బాబుకు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతి బాబు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జగపతి బాబు. కేవలం ఫ్యామిలీ హీరోగానే కాదు.. సముద్రం, అంతపురం లాంటి సినిమాలతో మాస్ హీరోగానూ క్రేజ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు జగపతి బాబు సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. జగపతి బాబు సినిమా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ కు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇక హీరోగా రాణించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా మారారు.
ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది
లెజెండ్ సినిమాలో తన విలనిజం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు జగ్గూభాయ్. ఆతర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో విలన్ గా ఇంకొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు జగపతి బాబు. రీసెంట్ గా సలార్, పుష్ప 2 సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే జగపతిబాబుకు సంబందించిన ఓ పాత వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఆయన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతే కాదు ఓ హీరయిన్ గురించి కూడా మాట్లాడారు జగపతి బాబు.
ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఆర్జీవీ గురించి మాట్లాడుతూ.. “నేను రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాం.. అతను తిక్కలోడే, నేను తిక్కలోడినే మా ఇద్దరికీ పడదు అని అన్నారు. మూడు పెగ్గుల తర్వాత ఇద్దరికీ గొడవ అవుతుంది అని సరదాగా చెప్పారు జగపతి బాబు. అలాగే గాయం సినిమా అప్పుడు ఊర్మిళ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అన్నాడు.దానికి నేను నాకు ఆ అమ్మాయికి అంత కెమిస్ట్రీ ఏమీ అనిపించలేదు అన్నాను. అప్పుడు ఆర్జీవీ ఆ అమ్మయిని పిలిచి నువ్వంటే ఇతనికి ఇష్టం లేదంట అని చెప్పాడు. ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం లేదు అని నన్ను అడిగింది. దానికి నాకు చిరాకు వచ్చి సరే ఇప్పుడు చెప్తున్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేశా.. దానికి ఆర్జీవీ.. లేదు ఊర్మిళ అంటే ఇష్టం అని చెప్పు అప్పుడే నేను గాయం సినిమా ఫినిష్ చేస్తా అన్నాడు. నేను ఊర్మిళ అంటే ఇష్టం లేదు, ఆర్జీవీ అంటే ఇష్టం లేదు.. నాకు శ్రీదేవి అంటే ఇష్టం కాబట్టి ఈ ఇద్దరూ నాకు ఇష్టం లేదు” అని జగపతి బాబు చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.