Allu Arjun – Sukumar: రిలాక్స్ మోడ్‌లో బన్నీ, సుక్కు… వారి నెక్ట్స్ మూవీ డీటైల్స్ ఇదిగో..!

పుష్ప 2 (Pushpa 2 Movie) హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. ప్రస్తుతం వారిద్దరి ఫోకస్ పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ మీదే ఉంది. అయితే వారు నెక్ట్స్ ఏ మూవీ ప్రాజెక్ట్స్ చేస్తారన్న అంశంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంటోంది. వాస్తవానికి అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఉంది.

Allu Arjun - Sukumar: రిలాక్స్ మోడ్‌లో బన్నీ, సుక్కు... వారి నెక్ట్స్ మూవీ డీటైల్స్ ఇదిగో..!
Allu Arjun and Sukumar next movies
Follow us
Satish Reddy Jadda

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 11, 2024 | 3:55 PM

పుష్ప 2 జోరు కంటిన్యూ అవుతోంది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ పార్టీ కూడా ఇచ్చేసిన పుష్పరాజ్‌ మరికొద్ది రోజులు ఇదే హైలో ఉండబోతున్నారు. చాలా రోజులుగా హెక్టిక్‌ షెడ్యూల్స్ ప్రమోషన్ ఈవెంట్స్‌ తో బిజీగా ఉన్న బన్నీ లాంగ్ బ్రేక్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతోంది. ప్రస్తుతానికి బన్నీ ఫోకస్ అంతా పుష్ప 2 సక్సెస్‌ సెలబ్రేషన్స్ మీదే ఉంది. అన్ని రికార్డ్స్‌ ను చెరిపేస్తూ దూసుకుపోతున్న పుష్పరాజ్‌ మేనియాను అల్లు అర్జున్‌ (Allu Arjun) అవుట్‌ రైట్‌ గా ఎంజాయ్ చేస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా ఇదే స్టేటస్‌ లో ఉన్నారు. పుష్ప రిలీజ్‌ కు ముందు ప్రమోషన్స్‌ లో పాల్గొనేందుకు కూడా టైమ్‌ లేనంత బిజీగా ఉన్న సుకుమార్‌.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంకా ప్రమోషన్స్‌ బిజీ కంటిన్యూ అవుతోంది. ఇవన్నీ పూర్తయిన తరువాత ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్‌ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్‌. హాలీడే అయ్యాకే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు.

నెక్ట్స్ బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఉంది. సూపర్ హిట్ కాంబో త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీని అల్లు అర్జున్‌ ఎనౌన్స్ చేశారు. గతంలో ఈ కాంబినేషన్‌ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సక్సెస్‌ లను మరిపించే రేంజ్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ను ప్లాన్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆల్రెడీ నిర్మాణ సంస్థ కొన్ని అప్‌డేట్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త పాయింట్‌తో సినిమా చేయబోతున్నామన్నారు నిర్మాత నాగవంశీ. బ్రేక్ తరువాత ఈ ప్రాజెక్ట్‌ లోనే జాయిన్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్‌.

సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయ్యింది. అదే సమయంలో రామ్ చరణ్‌ హీరోగానూ ఓ సినిమా చేసే ప్లాన్ ఉందని చాలా రోజుల క్రితమే ఎనౌన్స్ చేశారు సుక్కు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి నెక్ట్స్ స్టార్ట్ చేస్తారా..? లేదంటే ఈ రెండు కాకుండా మరో ప్రాజెక్ట్‌ ను లైన్‌ పెడతారా..? ఇవన్నీ పక్కన పెట్టి పుష్ప 3 వర్కే స్టార్ట్ చేస్తారా అన్నది కొద్ది రోజుల బ్రేక్ తరువాతే క్లారిటీ వస్తుంది.

పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..