బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన భామలు చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసిన ఈ అమ్మడు చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2024 | 6:28 PM

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు కనిపించకుండా మాయమయ్యారు. అప్పటిలో తమ అందం, ఆకట్టుకునే అభినయంతో కవ్వించిన హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీస్‌తో సెటిల్ అయ్యారు. మరికొంతమంది విదేశాలకు వెళ్లిపోయారు. కాగా పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్, ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె.. ఆమె కోసమే కుర్రాళ్ళు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ఆమె ఫోటోలను సినిమా పోస్టర్స్ ను భద్రంగా ఇంట్లో గోడలకు అతికించుకునే వారు. అంత ఫెమస్ హీరోయిన్ ఆమె.. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

అప్పట్లో హీరోయిన్స్ సినిమాలకు చాలా కీలకంగా ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్స్ కేవలం పాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో మమతా కులకర్ణి ఒకరు. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించి మెప్పించింది ఆ అందాల తార. ముఖ్యంగా బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. మిథున్ చక్రవర్తి తో మొదలు పెట్టి అజయ్ దేవగణ్, బాబీ డియోల్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సల్మాన్ ఖాన్, గోవిందా, అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్ వరకు ఎంతో మంది హీరోలతో నటించారు మమతా.

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

ఇక తెలుగులోనూ ఆమె నటించి మెప్పించారు. మోహన్ బాబు నటించిన దొంగా పోలీస్, ప్రేమశిఖరం, బ్రహ్మ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది మమతా కులకర్ణి. ఇక ఇప్పుడు మమతా సినిమాలకు దూరం గా ఉంటుంది. చాలా కాలం అజ్ఞాతంలో ఉన్న మమతా కులకర్ణి దాదాపు 25 ఏళ్ల తర్వాత  ముంబైకి తిరిగి వచ్చింది. గతంలో డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత ఆమె పై ముంబై కోర్టు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసును కొట్టివేసింది. ఇక తాజాగా ముంబైలో అడుగుపెట్టిన మమతా ఎమోషనల్ అయ్యింది. “నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్‌, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్‌ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం రాలేదు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా వచ్చాను” అని తెలిపింది మమతా కులకర్ణి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.