Ramayan మూవీపై కీలక అప్‌డేట్.. శ్రీరాముడి పాత్రపై క్లారిటీ ఇచ్చిన రణబీర్
Ranbir's Ramayan Movies: రామాయణ్ విషయంలోనూ ఆదిపురుష్ ట్రెండ్ ఫాలో అవుతోంది మూవీ టీమ్. నిన్న మొన్నటి వరకు అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్న చర్చే జరిగింది. ఇప్పుడు సడన్ గా తొలి భాగం షూటింగ్ పూర్తయ్యిందంటూ సర్ ప్రైజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో రణబీర్ కపూర్.
పాన్ ఇండియా సినిమా అంటే మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతీ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్. అందుకే ఆ సినిమాల ప్రొడక్షన్ టైమ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. జానర్ ఏదైనా నేషనల్ సినిమా అంటే మినిమమ్ రెండేళ్ల వర్క్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందులో కేవలం షూటింగ్ కోసమే దాదాపు ఏడాది టైమ్ కేటాయిస్తున్నారు. యాక్షన్, కమర్షియల్ సినిమాల పరిస్థితే ఇలా ఉంటే ఫోక్ లోర్, హిస్టారికల్, మైథలాజికల్ మూవీస్‌ది ఇంకో ఎత్తని తెలిసిందే.
మిగతా జానర్ల సంగతి పక్కన పెడితే మైథలాజికల్ మూవీస్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అవుతోంది. మామూలుగా పురాణగాథను తెరకెక్కించాలంటే భారీ సెట్స్, అదే స్థాయిలో మేకప్, అంతుకు మించిన ప్రొడక్షన్ డిటైలింగ్ అవసరం. అందుకే గతంలో మైథలాజికల్ జానర్ మూవీ అంటే అన్ని సినిమాల కన్నా ఎక్కువ టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మైథలాజికల్ మూవీస్ ను అన్నింటికన్నా ఈజీగా ఫినిష్ చేసేస్తున్నారు మేకర్స్.
ఆ మధ్య ఆదిపురుష్ విషయంలో ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు దర్శకుడు ఓం రవుత్. ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ లాంటి భారీ కాస్టింగ్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ వర్క్ ను జస్ట్ 100 రోజుల్లోనే పూర్తి చేశారు ఓం. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు వెళ్లటం, ప్రీ ప్రొడక్షన్ విషయంలోనూ క్లియర్ గా ఉండటంతో పాటు మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ఇండోర్ లో గ్రీన్‌మ్యాట్ స్టూడియోలోనే చేసేయటంతో ఆదిపురుష్ ను అంత షార్ట్ పీరియడ్ లో ఫినిష్ చేయగలిగారు.
ఇప్పుడు రామాయణ్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది మూవీ టీమ్. నిన్న మొన్నటి వరకు అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్న చర్చే జరిగింది. ఇప్పుడు సడన్ గా తొలి భాగం షూటింగ్ పూర్తయ్యిందంటూ సర్ ప్రైజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో రణబీర్ కపూర్. మరి ఇంత షార్ట్ టైమ్ లో ఈ సినిమా షూటింగ్ ఎలా పూర్తి చేయగలిగారన్నది ఆసక్తికరంగా మారింది.
రామాయణ్ విషయం లోనూ మేకర్స్ ఆదిపురుష్ స్టైల్ నే ఫాలో అవుతున్నారా…? ఈ సినిమాను కూడా పూర్తిగా ఇండోర్ లోనే షూట్ చేస్తున్నారా? ఆల్రెడీ షూటింగ్ పూర్తయితే, రిలీజ్ కు నెక్ట్స్ ఇయర్ దీపావళి వరకు టైమ్ తీసుకోవటం ఎందుకు? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసమే అంత టైమ్ తీసుకుంటున్నారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇండస్ట్రీ జనాల్లో కనిపిస్తున్నాయి.
కాకపోతే రామాయణ్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయంపై క్లారిటీ వచ్చేసింది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో తాను శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నట్లు రణబీర్ కపూర్ కన్ఫర్మ్ చేశారు. ఇది తన డ్రీమ్ రోల్‌గా పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో అత్యుత్తమ స్టోరీగా చెప్పారు. జెడ్డాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో మాట్లాడుతూ రణబీర్ కపూర్ ఈ వివరాలు వెల్లడించారు. కాగా ఈ మూవీలో సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తోంది.