Honey Rose: అబ్బో.. హనీరోజ్ కోరికలు మాములుగా లేవుగా..! అమ్మడికి అలాంటివాడే కావాలంట
హాట్ బ్యూటీ హనీ రోజ్‌కు చాలా మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ మధ్య కాలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో హనీ హవా ఎక్కువైంది. ఇప్పుడు, హనీ రోజ్ ప్రారంభోత్సవాలకు హాజరవడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్ళ మనసు దోచేసింది హాట్ బ్యూటీ హనీరోజ్. వీరసింహారెడ్డి సినిమా తర్వాత అసలు హనీ రోజ్ ఎవరు.? ఇన్నాళ్లు ఎక్కడ ఉంది.? అంటూ తెగ వెతికేశారు కుర్రకారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ వీరసింహారెడ్డి కంటే ముందు కొన్ని తెలుగు సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత మలయాళం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో హనీ రోజ్ చాలా పాపులర్ నటి. చాలా కాలం తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో తిరిగి తెలుగులో మెరిసింది. బాలయ్య సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది.
ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది
చాలా రోజుల తర్వాత హనీ రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది. మొన్నామధ్య విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. హనీ రోజ్ చేసిన అన్ని ఫోటోషూట్‌లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ అమ్మడు సినిమాలతో కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే కాలం గడిపేస్తోంది.
ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
తనకు షాపింగ్ మాల్స్ ఓపినింగ్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది హనీ రోజ్. తాను ప్రారంభోత్సవానికి వెళ్లిన చోట చాలా మందిని చూస్తుంటే ఆనందంగా ఉంటుందని తెలిపింది. తనను చాలా ప్రారంభోత్సవాలకు ఆహ్వానించారని అలాగే ఓ పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి పిలిచారు. అక్కడ ఏం ప్రారంభోత్సవం చేయాలో అర్థం కావడం లేదు అని హనీ రోజ్ సరదాగా అన్నారు. అలాగే తనకు కాబోయేవాడి గురించి కూడా కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని.. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. మంచివాడు వస్తే పెళ్లి చేసుకుంటానని, నాకు సరిపోయే వ్యక్తి కావాలని హనీ తెలిపింది. ఆ వ్యక్తిని చూడగానే నాకు అర్థమవుతుంది. మంచి వైబ్ కలగాలి. కుటుంబాన్ని గౌరవించే వ్యక్తి అయ్యుండాలి.. నా కోరికలకు అడ్డుగా నిలిచే వ్యక్తి కాకూడదని, అతనిలో స్వార్థం ఉండకూడదని హనీ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.