Manchu family fight: మంచు ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్.. మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్..

మంచు ఫ్యామిలీ డ్రామా రోజుకొక మలుపు తిరుగుతుంది. నిన్న (మంగళవారం) మనోజ్‌ నువ్వు నా గుండెల మీద తన్నావ్‌ రా అంటూ నిన్న మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి బయటకు వచ్చింది. అందులో అంతా మనోజ్‌దే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావ్, తాగుడుకి బానిస అయ్యావ్ అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది.

Manchu family fight: మంచు ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్.. మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్..
Manchu Family Fight
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2024 | 6:41 PM

ఎన్నాళ్ల నుంచి రగులుతుందో కానీ ఆదివారం మాత్రం కుటుంబ విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్‌ అయ్యాయి. ముందుగా తండ్రీకొడుకు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ గొడవలేం లేవని కవర్‌ చేస్తూ మంచు ఫ్యామిలీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. కానీ మంచు మనోజ్ నడవలేని స్థితిలో సోమవారం హాస్పిటల్‌కి రావడంతో విషయం అందరికి అర్ధమైంది. ఆ తర్వాత తనపై పది మంది దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే.. తన కొడుకు, కోడలి వల్ల ప్రాణ హాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే దుబాయ్‌లో ఉన్న విష్ణు హైదరాబాద్‌ రావడం.. అప్పటికే మోహన్ బాబు, మనోజ్ తమ తమ ప్రైవేట్ సైన్యాన్ని దించుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి చక్కర్లు కొట్టసాగింది. అందులో అంతా మనోజ్‌తే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావ్ అని, తాగుడుకి బానిస అయ్యావ్ అని మోహన్ బాబు వాయిస్ వినిపించింది. ఇక నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నిడిచింది. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకపోవడం, గేట్లు తోసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత చిరిగిన చొక్కాతో బయటకు రావడం ఇదంతా చకచకా జరిగిపోయింది. ఇక ఇది కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్‌ బాబు రౌడీయిజాన్ని చూపించారు. మీడియాపై దాడి అనంతరం రాత్రికి రాత్రే మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

మనోజ్ ఫిర్యాదు కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ కుమార్ కందులను పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ పైన దాడి కేసులో అతడిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ మయం విషయంలోనూ కిరణ్ పై ఆరోపణలు చేశారు మనోజ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.