Pushpa 2: పుష్ప 2 సినిమా చూసిన వెంకటేష్.. అల్లు అర్జున్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోంది. డిసెంబర్ 05న విడుదలైన ఈ సినిమా 1000 కోట్లకు చేరవలో ఉంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 విడుదలైన ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్లకు చేరువైంది. తొలి రోజు రూ.294 కోట్లతో మొదలైన వసూళ్ల పుష్ప 2 వసూళ్ల పర్వం అదేస్థాయిలో కొనసాగుతోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ అల్లు అర్జున్ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తున్నాయి. బన్నీ అభిమానులతో పాటు సినీ అభిమానులు, సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పుష్ప 2 సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా తారలు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అధ్బుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో రష్మిక అసాధారణ ప్రదర్శన చేసింది. గొప్ప విజయం అందుకున్న డైరెక్టర్ సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు’ అని ప్రశంసలు కురిపించారు. ఇక చివర్లో పుష్ప ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘అస్సలు తగ్గేదేలే’ అని క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పుష్ప 2 సినిమాపై వెంకటేశ్ రివ్యూ… పోస్ట్ ఇదిగో..
A thunderous and unforgettable performance @alluarjun!! Couldn’t take my eyes off you on the screen ❤️❤️ So happy to see everyone celebrating the movie across the country! @iamRashmika you were phenomenal. Congratulations to #Sukumar @ThisIsDSP and the entire team of… pic.twitter.com/VcMxG5oLBA
— Venkatesh Daggubati (@VenkyMama) December 11, 2024
కాగా ‘పుష్ప 2’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కు చేరువలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ తదితరులు నటించారు.
సౌత్ తో పాటు నార్త్ లోనూ పుష్ప రాజ్ హవా..
1000 Cr Rampage Rule 💥🪓@maskman_studios ❌ @thebackpckerboy #PUSHPA2HitsFastest1000Cr @PushpaMovie #Pushpa2 #Pushpa2TheRule #AlluArjun @alluarjun pic.twitter.com/qEZJ2fznnV
— Suryateja Kandukuri (@thebackpckerboy) December 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.