Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పూనమ్ కౌర్ సంచలన పోస్ట్.. అలా అనేసిందేంటి?
సంధ్య థియేటర్‌వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనిని ఖండిస్తున్నారు. 'వియ్ ఆల్ స్టాండ్ విత్ అల్లు అర్జున్'అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (డిసెంబర్ 13) అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆ వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో బన్నీని అరెస్ట్ చేయడాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తప్పుపడుతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండింారు. తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ ఈ విషయంపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ‘పబ్లిక్ ర్యాలీలు సహా పలు ఘటనలలో చాలామంది అమాయకులు తొక్కిసలాట ఘటనల్లో చనిపోయారు. ఇప్పుడు ఆ లిస్టు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇటీవల ఒక యంగ్ యాక్టర్ కూడా ర్యాలీలో ఊపిరాడక కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. వారసత్వంతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన స్టార్ అల్లు అర్జున్’ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఈ పోస్ట్ తర్వాత వెంటనే మరో పోస్ట్ పెట్టింది పూనమ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ఫెవరేట్ హీరో అల్లు అర్జున్ అంటూ తనతో కలిసి దిగిన ఓ పాత ఫోటో షేర్ చేసింది. దీంతో సినీ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇది వరస్ట్ టైమింగ్ అని అటెన్షన్ కోసమే బన్నీ ఫొటో పోస్ట్ చేసిందంటూ నెటిజన్లు పూనమ్ పై మండిపడుతున్నారు.
పూనమ్ కౌర్ ట్వీట్..
I am trying to look at list of people who have been around on public rallies and innocents have died scorching under the sun also running into a stampede, one of the young actors who died due to discomfort and cardiac arrest- Allu Arjun is star made out of hard work not legacy.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 13, 2024
అల్లు అర్జున్ తో పూనమ్ కౌర్..
Fav actor from Telugu film industry 🫶 pic.twitter.com/EoZgBqgn60
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.