AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Arrest: రేపు విడుదలకానున్న అల్లు అర్జున్.. రాత్రంతా జైల్లోనే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Allu Arjun Arrest: రేపు విడుదలకానున్న అల్లు అర్జున్.. రాత్రంతా జైల్లోనే
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2024 | 10:59 PM

Share

అల్లు అర్జున్ విడుదల ఆలస్యం అయ్యింది. రేపు ఉదయం 7 గంటలకు విడుదల కానున్న అల్లు అర్జున్. ఈ రాత్రంతా జైల్లోనే ఉండనున్నారు బన్నీ. మంజీరా బ్యారక్ లో ఉండనున్న అల్లు అర్జున్. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు పోలీసులు. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు చావుబ్రతుకుల మధ్య హాస్పటల్ లో ఉన్నాడు. దాంతో పోలీసులు థియేటర్ యాజమాన్యం, అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసింది. కాగా ఈ రోజు ( శుక్రవారం) అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం అల్లు అర్జున్ ను తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.

అనంతరం ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం  అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ తన పై నమోదైన కేసులపై క్వాష్ పిటీషన్ ను వేశారు. కాగా ఈరోజు అల్లు అర్జున్ క్వాష్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు క్వాష్ పిటీషన్ ను తిరస్కరించింది.

దాంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాగా అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు. దాంతో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అలాగే అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. వ్యక్తి గత పూచికతతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. జైలు సూపర్ డెంట్ కు షూరిటీ లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అరుణబ్ గోస్వామి తీర్పు ఆధారంగా … అల్లు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఈరోజే అల్లు అర్జున్ విడుదల అవుతాడని అనుకున్నారు కానీ. ప్రొసీజర్ ఆలస్యం అవ్వడంతో రేపు ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ ను విడుదల చేయనున్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..