Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముక్త కంఠంతో బన్నీ అరెస్ట్ ను ఖండిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై స్పందించారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు
Allu Arjun, Ashwini Vaishnaw
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2024 | 9:58 PM

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ ను ఎలా బాధ్యుడిని చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ‘వియ్ ఆల్ స్టాండ్ విత్ అల్లు అర్జున్’అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. ‘ సినిమా ఇండస్ట్రీ, నటీ నటుల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదు. హీరో అల్లు అర్జున్ అరెస్టుతో ఇది మరోసారి నిరూపితమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, స్థానిక అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఈ తప్పును ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలి. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. వీటిని వదిలేసి నిత్యం సినీ నటీనటులపై విరుచుకుపడడం తగదు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కారుపై మండి పడ్డారు అశ్వినీ వైష్ణవ్.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు బీజేపీ ఎంపీ,  రేసు గుర్రం విలన్ రవి కిషన్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. ‘అల్లు అర్జున్ అంతర్జాతీయ కళాకారుడు. ఆయన పట్ల ఈ రకమైన ప్రవర్తన ఊహించలేనిది. అతను పెద్దమనిషి, పెద్ద పన్ను చెల్లింపుదారుడు కూడా. బట్టలు కూడా వేసుకోనివ్వకుండా పిల్లలు, తల్లిదండ్రుల ముందే తీసుకెళ్లారు. వ్యక్తిగత ద్వేషంతోనే ఆయనపై ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఓ అంతర్జాతీయ కళాకారుడి పట్ల పోలీసులు ఈ విధంగా ఎలా ప్రవర్తించారనే దానిపై విచారణ జరగాలి’ అని రవి కిషన్ డిమాండ్ చేశారు.

అశ్వినీ వైష్ణవ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.