Allu Arjun Arrest: అల్లు అర్జున్‌తో దురుసుగా ప్రవర్తించలేదు.. అసలు ఏం జరిగిందో చెప్పిన పోలీసులు

అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అలాగే సంధ్య థియేటర్ లో ఏం జరిగిందో కూడా వివరించారు పోలీసులు. అల్లు అర్జున్‌తో దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌తో దురుసుగా ప్రవర్తించలేదు.. అసలు ఏం జరిగిందో చెప్పిన పోలీసులు
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2024 | 8:55 PM

సంధ్య థియేటర్ లో ఘటన పై పోలీసుల క్లారిటీ ఇచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చారు. డీసీపీ మాట్లాడుతూ.. భారీ ఈవెంట్లకు ముందస్తు అనుమతి అడగడం తప్పనిసరి. భారీ కార్యక్రమాలకు నిర్వాహకులు నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి అనుమతి తీసుకోవాలి అని అన్నారు. కానీ ఈ ఘటనలో ఇన్వార్డ్ సెక్షన్ లో ఒక లెటర్ ని ఇచ్చి సంధ్య థియేటర్ యాజమాన్యం వెళ్లిపోయారు. హీరో రాక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, మేమే ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశాం అన్నారు డీసీపీ. అలాగే ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వచ్చేవరకు పబ్లిక్ క్రౌడ్ అంతా నార్మల్గానే ఉంది అల్లు అర్జున్ వచ్చాకే పరిస్థితి అదుపుతప్పింది అని అన్నారు.

థియేటర్ లోకి ఎంటర్ అయ్యే ముందు తన కారులో నుండి బయటికి వచ్చి అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేశారు. ఆయన అభివాదం చేయటంతో జనాల తాకిడి ఒక్కసారిగా అదుపుతప్పింది. అతని ప్రైవేట్ సెక్యూరిటీ పబ్లిక్ని తోసేసారు. అప్పటికే అక్కడి నుండి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కు సూచించాము. కానీ అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లి 2 గంటల పాటు ఉన్నారు.

ఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్న బాబు ఇంకా హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఉన్నాడు అని అన్నారు డీసీపీ. అరెస్టు చేసిన విధానం పైన క్లారిటీ ఇచ్చారు పోలీసులు. పోలీసులు ఎక్కడ అల్లు అర్జున్ తో దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. పోలీసు తన ఇంటికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకునేందుకు సమయం కావాలని కోరాడు. ఆయన బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు పోలీసులు బయటే వైట్ చేశారు. ఆయన బయటికి వచ్చినప్పుడే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తగిన సమయం కూడా ఇచ్చాము. తనంతట తానుగా వచ్చి పోలీసు వాహనం ఎక్కాడు అని క్లారిటీ ఇచ్చారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్‌తో దురుసుగా ప్రవర్తించలేదు: పోలీసులు
అల్లు అర్జున్‌తో దురుసుగా ప్రవర్తించలేదు: పోలీసులు
మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడనీ.. టీచర్‌ను కత్తితో పొడిచిన స్టూడెంట్‌
మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడనీ.. టీచర్‌ను కత్తితో పొడిచిన స్టూడెంట్‌
జుట్టు ఊడిపోతుందా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
జుట్టు ఊడిపోతుందా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది..!
ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది..!
ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే మ్యాచులు
ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే మ్యాచులు
భార్య ఒంటరిగా వాకింగ్‌కు వెళ్తుందనీ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త
భార్య ఒంటరిగా వాకింగ్‌కు వెళ్తుందనీ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త
అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న చిలుక.. ఫన్నీ వీడియో వైరల్
అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న చిలుక.. ఫన్నీ వీడియో వైరల్
ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. 'రజాకార్' ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. 'రజాకార్' ఎక్కడ చూడొచ్చంటే?
పెండింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేయాలిః రేవంత్
పెండింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేయాలిః రేవంత్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలాసీతారామన్..వరుసగా ఆరోసారి ఛాన్స్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలాసీతారామన్..వరుసగా ఆరోసారి ఛాన్స్