- Telugu News Photo Gallery Cinema photos Actress Radhika Apte welcomes first child with husband Benedict Taylor
Radhika Apte: పెళ్లైన 12 ఏళ్లకు తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికాకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
Updated on: Dec 13, 2024 | 10:09 PM

బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మెప్పించిన రాధికా ఆప్టే తల్లిగా ప్రమోషన్ పొందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా బిడ్డకు పాలిస్తూ ల్యాప్ ట్యాప్ తో వర్క్ చేస్తోన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది రాధికా ఆప్టే. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్ గా మారింది.

పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాధికా ఆప్టేకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అయితే తనకు పుట్టింది బాబునా? పాపనా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రాధిక.

బ్రిటన్ కు చెందిన బెనెడిక్ట్ టేలర్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసిన రాధికా ఆప్టే 2012లో అతనితో పెళ్లిపీటలెక్కింది. ఉత్తర ఇంగ్లండ్‌లో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర-1,2, లెజెండ్, లయన్, ధోని, కబాలి తదితర తెలుగు సినిమాల్లో నటించింది.




