Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? చదివిందేమో ‘లా’.. ఇప్పుడేమో టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్

'డాక్టరవ్వాల్సింది యాక్టర్ అయిపోయాను'.. మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ల నోటి నుంచి వచ్చే మాట. అయితే 'సినిమాల్లో నటించడమూ తెలుసు.. నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించడమూ తెలుసు' అని అంటోందీ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? చదివిందేమో 'లా'.. ఇప్పుడేమో టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2024 | 6:28 PM

పై ఫొటోలో అమ్మపై కూర్చొని అల్లరి చేస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ముంబైలోని మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2018లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమానే మాస్ మహరాజా రవితేజతో. ఇక రెండో సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా ఈ ముద్దుగుమ్మ కు మాత్రం మంచి పేరొచ్చింది. తన అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత గోపీచంద్, సుధీర్ బాబు వంటి క్రేజీ హీరోలతోనూ స్క్రీన్‌ షేర్ చేసుకుంది. తమిళంలో జీవా తో కూడా ఓ సినిమా చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ మాత్రం పడడం లేదు. అదే సమయంలో చేసిన ప్రతి సినిమాలోనూ ఈ అందాల తార అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. అన్నట్లు ఈ బ్యూటీ మల్టీపుల్ ట్యాలెంటెడ్. హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు నేల టిక్కుట్టు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మాళవిక శర్మ.ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

ముంబయిలో పుట్టి, పెరిగిన మాళవిక శర్మ అక్కడే చదువుకుంది. ఎల్‌.ఎల్‌.బి. కూడా పూర్తిచేసింది. కాలేజీ రోజుల్లోనే మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ అందాల తార పలు యాడ్స్‌ లో నటించింది. ఇవే ఆమెకు సినీ అవకాశాలు తెచ్చిపెట్టాయి. అలా 2018లో రవితేజ ‘నేల టికెట్టు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రామ్ పోతినేనితో కలిసి రెడ్ లో నటించింది. ఈ రెండూ సినిమాలు మాళవికకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ‘కాఫీ విత్‌ కాదల్‌’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాచో స్టార్ గోపీచంద్‌ సరసన మాళవిక నటించిన ‘భీమా’ ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత సుధీర్ బాబుతో కలిసి హరోం హర’తో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో మాళవిక నటనకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మాళవిక శర్మ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.