Allu Arjun: అల్లు అర్జున్‌ను ఫోన్లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చావు బ్రతుకుల మధ్య హాస్పటల్ లో ఉన్నాడు.

Allu Arjun: అల్లు అర్జున్‌ను ఫోన్లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Allu Arjun, Cm. Chandrababu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2024 | 6:20 PM

ఉదయం నుంచి చాలా మంది సెలబ్రెటీలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ను సినిమా స్టార్స్ అందరూ పరామర్శిస్తున్నారు. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చావు బ్రతుకుల మధ్య హాస్పటల్ లో ఉన్నాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు. దాంతో అల్లు అర్జున్ ను నిన్న ( శుక్రవారం రోజున ) పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఒక్క రోజు అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వచ్చింది.

కాగా శనివారం ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు. ముందుగా గీత ఆర్ట్స్ కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. ఇక ఉదయం నుంచి సినీ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ ను పరామర్శించడానికి ఆయన నివాసానికి వెళ్తున్నారు.

కాగా షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోలు అల్లు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో ఫోన్లో మాట్లాడారు. తాజాగా ప్రభాస్ కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆయన్ను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నిన్న అల్లు అరవింద్‌కు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.

నకిలీ ED రైడ్స్‌ .. గ్యాంగ్‌ మూవీ సీన్‌ దింపేశారుగా.! కట్‌ చేస్తే
నకిలీ ED రైడ్స్‌ .. గ్యాంగ్‌ మూవీ సీన్‌ దింపేశారుగా.! కట్‌ చేస్తే
ఏపీ కేబినెట్‌లో నాగబాబుకు ఆ శాఖే ఇస్తారట.! వీడియో..
ఏపీ కేబినెట్‌లో నాగబాబుకు ఆ శాఖే ఇస్తారట.! వీడియో..
MRNA కొవిడ్‌ టీకాలతో మరణించే ముప్పు.. కోట్లమందిలో కొత్త టెన్షన్‌!
MRNA కొవిడ్‌ టీకాలతో మరణించే ముప్పు.. కోట్లమందిలో కొత్త టెన్షన్‌!
కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. తీరా చూస్తే!
కారు దిగి పారిపోతున్నవారిని పట్టుకున్న పోలీసులు.. తీరా చూస్తే!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.!
భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.!
భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగితే ఏమౌతుంది.? వీడియో..
భోజ‌నం చేసేట‌ప్పుడు నీళ్లు తాగితే ఏమౌతుంది.? వీడియో..
రైతులు, యువత హక్కులను కాలరాస్తున్నారుః రాహుల్
రైతులు, యువత హక్కులను కాలరాస్తున్నారుః రాహుల్
ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?