AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘ముందే చెప్పానా? దిష్టి తీయించుకోమని’.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై వేణు స్వామి భార్య.. వీడియో

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయ్యారు. ఆ తర్వాత కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి రిలీజయ్యాడు. ఇప్పుడు ఈ విషయంపై వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి స్పందించింది.

Allu Arjun: 'ముందే చెప్పానా? దిష్టి తీయించుకోమని'.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై వేణు స్వామి భార్య.. వీడియో
Allu Arjun, Venu Swamy Wife
Basha Shek
|

Updated on: Dec 16, 2024 | 1:20 PM

Share

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట కేసులో అల్లు అర్జున్ ను ఏ11 గా చేర్చారు పోలీసులు. అయితే అనుకోకుండా అతనిని అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు బన్నీ అరెస్ట్ ను ఖండించారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైనప్పటికీ ఒక రాత్రంతా చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం కానీ అతను రిలీజ్ కాలేదు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇప్పుడిదే విషయంపై వీణా శ్రీవాణి స్పందించింది. అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి తీస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ‘ చెప్పానా? ముందే చెప్పానా? గుమ్మడి కాయలతో దిష్టి తీయించుకోమని. ఇప్పుడు దిష్టి తీస్తున్నారు. పోన్లెండి.. నా మాట మీద ఆ మాత్రమైన గౌరవముంది. ఇక దిష్టంతా పోయింది లెండి. నెక్ట్స్ చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి.. ఆల్ ది బెస్ట్’ అంటూ చెప్పుకొచ్చింది.

వీణా శ్రీవాణి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ముఖ్యంగా బన్నీ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ నటనను ప్రశంసిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది వేణు స్వామి భార్య. అందులో ఇలా చెప్పుకొచ్చింది. పుష్ప 2 సినిమా చూశాను. ఏదైనా నచ్చినా, నచ్చకపోయినా నాకు సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటు. కళామతల్లి ఆశీస్సులు అల్లు అర్జున్ పై ఉన్నాయి. ఈ సినిమాలో నేను ఆయన నట విశ్వరూపం చూశాను. కళామ తల్లి ఆశీస్సులుంటే తప్ప ఇలాంటి నటన సాధ్యం కాదు. అల్లు అర్జున్ గారు.. మీకు ఇండస్ట్రీలో ఇప్పట్లో తిరుగు లేదు. ఒక వంద గుమ్మడి కాయల దిష్టి తీసుకోండి. ఎందుకైనా మంచిది’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి భార్య శ్రీవాణి వీడియో..

ఇప్పుడు ఇవే మాటలను మరోసారి గుర్తి చేసింది వీణా శ్రీవాణి. పుష్ప 2 సక్సెస్ తో అల్లు అర్జున్ కు దిష్టి తగిలిందని చెప్పుకనే చెప్పింది.

పుష్ప 2 సినిమాపై రివ్యూ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.