- Telugu News Photo Gallery Cinema photos Malayalam Megastar Mammootty next movie shooting updates on December 2024
Mammootty: మలయాళం మెగాస్టార్ లైన్ మార్చారా.! ఆ సినిమాలో ఆయన కాబట్టి చేసారా.!
ప్రయోగాలు చేస్తుంటేనే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుందని నమ్మే హీరో మమ్ముక్కా. ఆయన రీసెంట్ రిలీజులే కాదు, ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాల్లోనూ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు. మలయాళ టాప్ స్టార్ మమ్ముట్టికి మన దగ్గర స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. అయినా యాత్ర పార్ట్ ఒన్ అండ్ పార్ట్ టూతో తెలుగు ప్రేక్షకులకు రీసెంట్ టైమ్స్ లో మరింత దగ్గరయ్యారు మలయాళ మెగాస్టార్.
Updated on: Dec 16, 2024 | 12:15 PM

ప్రయోగాలు చేస్తుంటేనే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుందని నమ్మే హీరో మమ్ముక్కా. ఆయన రీసెంట్ రిలీజులే కాదు, ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాల్లోనూ అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు.

మలయాళ టాప్ స్టార్ మమ్ముట్టికి మన దగ్గర స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. అయినా యాత్ర పార్ట్ ఒన్ అండ్ పార్ట్ టూతో తెలుగు ప్రేక్షకులకు రీసెంట్ టైమ్స్ లో మరింత దగ్గరయ్యారు మలయాళ మెగాస్టార్.

ఇప్పుడు ఆయన లైనప్ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉందనే వార్తలు నెట్టింట్లో రెగ్యులర్‌గా కనిపిస్తున్నాయి. కాదల్ సినిమాలో మమ్ముట్టి కాబట్టి చేశారు..

మరే స్టార్ హీరో అయినా అంత ధైర్యం చేసేవారు కాదేమో.. అనే మాటలు ఆ మధ్య గట్టిగా వినిపించాయి. ఆ సినిమా మేనియాలో ఉండగానే రిలీజ్ అయింది భ్రమయుగం.

తంత్ర విద్యలు తెలిసిన వ్యక్తిగా భ్రమయుగంలో నటనతో కట్టి పడేశారు మమ్ముట్టి. తెలుగులో అంతగా క్లిక్ కాకపోయినా, మలయాళ ప్రేక్షకులకు మాత్రం చాలా నచ్చింది ఈ మూవీ.

ప్రస్తుతం బజూకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు మమ్ముట్టి. డిటెక్టివ్‌గా మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ సినిమా డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్..

కామిక్ టచ్‌తో ఉన్న డిటెక్టివ్ డొమినిక్ రోల్‌లో కనిపిస్తారు మమ్ముక్కా. 2025లో బజూకా అండ్ డొమినిక్ మూవీస్ ఆయనకు బంపర్ హిట్ టాక్ తెచ్చిపెట్టడం గ్యారంటీ అంటోంది మాలీవుడ్.




