- Telugu News Photo Gallery Cinema photos Have You Ever Seen Tollywood Actor Raghu Ram Wife Natalie Di Luccio, Who looks like a heroine
Raghu Ram: ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ సింగర్.. అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.. ఫొటోస్ ఇదిగో
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తరచూ కనిపిస్తోన్న విలన్ రఘురామ్. పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. నున్నటి గుండుతో కనిపించే ఈ కింది ఫొటోను చూస్తే ఇట్టే గుర్తు పడతారు. అన్నట్లు ఈ విలన్ మన తెలుగు అబ్బాయే. కానీ అతనికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది.
Updated on: Dec 17, 2024 | 10:09 PM

రఘురామ్ పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోని మచిలీపట్నంలోనే. అయితే మొదట గుర్తింపు తెచ్చుకుంది మాత్రం బాలీవుడ్ లో.

అక్కడ ఎంటీవీ 'రోడిస్' షోతో బబాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రఘురామ్. వీటితో పాటు మరికొన్ని టీవీ షోల్లోనూ రఘు మెరిశాడు.

ఇక రఘురామ్ మన దక్షిణాది ఆడియెన్స్ కు మొదటగా పరిచయమైంది శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతోనే. ఇందులో అతను విలన్ గ్యాంగ్ మెంబర్‌గా నటించాడు.

తమిళంతో పాటు ఇటీవల 'కీడాకోలా', 'మెకానిక్ రాకీ' తదిర తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు రఘురామ్.

సినిమాల సంగతి పక్కన పెడితే.. రఘురామ్ కెనడాకు చెందిన సింగర్ నటాలియాని పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.

ఇటీవలే ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. వీటిని చూసిన వారంతా ఈ విలన్ కు ఇంత అందమైన భార్య ఉందా? అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.




