KS Chithra: కాలం గాయాలను నయం చేస్తుందని అంటారు.. కానీ అనుభవిస్తున్న వారికే తెలుసు.. సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్..
సినీసంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకుంది. భాషతో సంబంధం లేకుండా వందలాది పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ప్రపంచమంతా ఆమె గొంతుకు అభిమానులే. ఇండస్ట్రీలో సింగర్ చిత్ర ప్రత్యేకం. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే సింగర్ చిత్ర తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.
సింగర్ చిత్ర.. సినీసంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వందలాది పాటలను ఆలపించింది. ఆమె పాటలు శ్రోతల హృదయాల్లో ఎప్పటికీ పదిలం. అనేక భాషలలో దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడింది. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఎన్నో సాంగ్స్ పాడింది. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే సింగర్ చిత్ర తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ముద్దుల కూతురు నందన పుట్టినరోజు సందర్భంగా గాయని కె.ఎస్ చిత్ర భావోద్వేగ పోస్ట్ చేసింది. తన కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సింగర్ చిత్ర చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
“కాలం అన్ని గాయాలను మాన్పుతుందని చెబుతారు. కానీ అది అలా తగ్గదని ఆ బాధను అనుభవించిన వారికే తెలుసు.. ప్రతి జన్మకు ఒక ప్రయోజనం ఉంటుందని.. అది పూర్తైన తర్వాత అనంతమైన ప్రపంచానికి వెళ్తారని విన్నాను. సమయం అన్నింటిని నయం చేస్తుందని అంటారు. కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొన్నవారికి మాత్రమే తెలుస్తోంది. గాయం ఇప్పటికీ కఠినమైనది. బాధాకరమైనది. మిస్ యూ నందన” అంటూ కూతురి ఫోటో షేర్ చేస్తూ రాసుకొచ్చింది చిత్ర.
ప్రతి ఏడాది తన కూతురి గురించి పోస్టులు చేస్తుంటుంది చిత్ర. పెళ్లయ్యాక పదిహేనేళ్లకు 2002లో చిత్ర దంపతులకు కూతురు నందన జన్మించింది. కానీ ఆ కూతురు డౌన్ సిండ్రోమ్ తో జన్మించింది. తొమ్మిదేళ్ల వయసులో 2011లో దుబాయ్ లోని ఎమిరేట్స్ హిల్స్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయింది. ఇప్పటికీ కూతురిని తలుచుకుని బాధపడుతుంటుంది చిత్ర.
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.